బిజినెస్

రిటైల్ రంగానికి రైట్ రైట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 3: పెట్టుబడులను ఆకర్షించడంలో, ఉద్యోగ అవకాశాల కల్పనలో రిటైల్ రంగం కీలకం కానుంది. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఈ రంగం ప్రధాన భూమిక పోషించనుంది. ప్రధాన ఆర్థిక వృద్ధి కారకాల్లో ఇది కూడా ఒకటని ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎపి రిటైల్ పాలసీ 2015-20ని రూపొందించింది. దేశంలో ఇలాంటి పాలసీని రూపొందించిన మొదటి రాష్ట్రం ఎపి. ప్రస్తుతం దేశంలో ఉన్న రిటైల్ మార్కెట్ 2020 నాటికి రెండింతలవుతుందని అంచనా. అందులో ఎపి పాత్ర కీలకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే వ్యాపార అనుకూల విధానాలు, కల్పించే సౌకర్యాల వల్ల 2021 నాటికి రాష్ట్రంలో కనీసం రూ.142 కోట్ల పెట్టుబడులు, 25వేల ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. పెట్టుబడులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కిరాణా షాపులు వంటి వాటిలో పెట్టుబడులు పెడతారు. ఈ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మలేషియాలోని పెమండు (పెర్మామెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ యూనిట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ మలేషియా) విధానాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమేరకు పెమండుతో ఎపి ప్రభుత్వం ఒప్పందం (ఎంఓయు) కూడా కుదుర్చుకుంది. స్థిరమైన ఈ ఒప్పందంలో భాగంగా మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వ పెమండు బృందాలు విద్య, రిటైల్ రంగాలపై అధ్యయనాలు, పరిశోధనలు మొదలుపెట్టాయి. రిటైల్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, సమస్యలు, సమస్యలకు మూలకారణాలను సమగ్రంగా అధ్యయనం చేశాయి. రాష్ట్ర రిటైల్ రంగం ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలను పెమండు గుర్తించింది. నగరాలు, పట్టణాలు ప్రణాళికాబద్ధంగా ఏర్పాటుకానందున రిటైల్ జోన్స్ ఏర్పాటు చేయడానికి తగినంత స్థలం లేదు. ఈ రంగానికి అనుకూలమైన వౌలిక సదుపాయాలు లేవు. ప్రస్తుతం ఉన్న రిటైల్ జోన్స్ అసంఘటితంగా, అక్కడక్కడా ఉన్నాయి. వాటికి సమీపంలో వాహనాల పార్కింగ్‌కు స్థలాలు లేవు. దానికితోడు గిడ్డంగులు కూడా అందుబాటులో లేవు. ప్రైవేటు వ్యాపారులను, పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలు లేవు. రిటైల్ వ్యాపారులు లైసెన్సులు పొందే విధానాలు వారికి అనుకూలంగా లేవు. పెట్టుబడులు సమకూర్చుకోడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. దీంతో ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది.