బిజినెస్

మండ పీతలపై అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 7: సముద్ర ఉత్పత్తుల్లో డిమాండ్ ఉన్న మండ పీతల పెంపకంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. మండ పీతలకు దేశ, విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, వీటిని పెంచడానికి ముందుకువచ్చే రైతులను ప్రోత్సహించనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతాల్లో లభించే మండ పీతలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. సాధారణ పీతల కంటే మండ పీత అధిక ధర పలుకుతుంది. చుక్క పీత, నలుపు రంగు పీత, చిన్న సైజు సాధారణ పీత కంటే మండ పీతల ధర ఎక్కువ. అయితే సాధారణ రకాల పీతల కంటే మండ పీతల ఉత్పత్తి తక్కువగా ఉంటోంది. స్టార్ హోటళ్ళు, సంపన్నుల గృహాల్లో విందు భోజనాలకు ఈ రకం పీతలను ఇటీవలి కాలంలో అధికంగా వినియోగిస్తున్నారు. రాష్ట్రేతర ప్రాంతాలకు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. అభయారణ్యాలు, మడ అడవులతోపాటు నదీ పరివాహక ప్రాంతాల్లో మండ పీతల ఉనికి ఎక్కువగా ఉంటుంది. ఈ రకం పీతలను చెరువుల్లో సాగుచేస్తే మత్స్యకారులు, రైతులకు ఆర్థికంగా మేలు కలుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఈ రకం పీతలకున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంత మండలాలు, యానాం, కోరంగి అభయారణ్యం తదితర ప్రాంతాలు, పల్లం, చిర్రయానాం వంటి చోట్ల మండ పీతల పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందుకు సీడ్‌ను ఉత్పత్తి చేసే పనిలో అధికారులున్నారు.