బిజినెస్

మనీ లాండ‘రింగ్’లోకి మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: బ్యాంకులకు ఉద్ధేశ్యపూర్వంగా వేలాది కోట్ల రూపాయల అప్పులను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి, యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ చైర్మన్ విజయ్ మాల్యాపై మనీ లాండరింగ్ కేసులో ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రస్తుతం విదేశాల్లో విజయ్ మాల్యా ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు బ్రిటన్, దక్షిణాఫ్రికా సహా కొన్ని దేశాలకు రొగేటరీ లేఖ (ఎల్‌ఆర్)లను జారీ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటివరకూ ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వివిధ దేశాల్లో విజయ్ మాల్యాకు గల స్థిర, చరాస్థుల వివరాలను సేకరించారని, ప్రస్తుతం వారు దక్షిణాఫ్రికా, బ్రిటన్, అమెరికా, హాంకాంగ్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో విజయ్ మాల్యా కూడబెట్టిన ఆస్థులపై దృష్టి సారిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ దేశాలకు రొగేటరీ లేఖలు (న్యాయపరమైన విజ్ఞప్తులు) పంపి విజయ్ మాల్యాకు సంబంధించిన స్థిర, చరాస్థులు, ఆస్థుల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు వీలుగా సంబంధిత కోర్టును ఆశ్రయించాలని ఎన్‌ఫోర్స్‌మెండ్ డైరెక్టరేట్ భావిస్తోంది.
కార్పొరేట్ రుణ పునర్ వ్యవస్థీకరణ పథకంలో విమానయాన రంగాన్ని చేర్చి ఆ పథకాన్ని విస్తరించాలని 2010లో రిజర్వు బ్యాంకు తీసుకున్న విధాన నిర్ణయంలోని తేడాల గురించి తెలుసుకునేందుకు వీలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆర్‌బిఐకి లేఖ రాసింది. విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (కెఎఫ్‌ఎ)తో పాటు మరికొన్ని విమానయాన సంస్థలు తమ రుణాలను పునర్ వ్యవస్థీకరించుకునేందుకు ఈ పథకానే్న ఉపయోగించుకున్నాయి.
మనీ లాండరింగ్ చట్టాల కింద విజయ్ మాల్యా ఆస్థులను జప్తు చేసేందుకు దేశంలో పెద్దగా ఆస్థులు అందుబాటులో లేకపోవడంతో విదేశాల్లో మాల్యాకు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థకు గల ఆస్థులను స్వాధీనం చేసుకోవాలని బ్యాంకులు కోరుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఐడిబిఐ బ్యాంకును మోసగించి విజయ్ మాల్యా రూ.900 కోట్ల రుణాన్ని పొందాడన్న ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విదేశాల్లో మాల్యాతో పాటు ఆయన సంస్థలు, అనుబంధ సంస్థలు కూడబెట్టిన ఆస్థులకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని రాబట్టాల్సిన అవసరం ఉంది. ఐడిబిఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల్లో మాల్యా దాదాపు 300 కోట్ల రూపాయలను భారత్ నుంచి తరలించాడన్న అభియోగాలపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విదేశాలకు రొగేటరీ లెటర్లు పంపిస్తే ఆ సొమ్ము ఎవరి వద్దకు చేరిందో తెలుస్తుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇందుకోసం తొలుత కోర్టు నుంచి ఎల్‌ఆర్‌ను పొందాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఈ ఎల్‌ఆర్‌ను విదేశీ సంస్థలకు పంపేందుకు మరింత సమయం పడుతుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. విజయ్ మాల్యా వ్యవహారంలో ప్రస్తుతం మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద దర్యాప్తు జరుగుతుండటమే ఇందుకు కారణమని ఆ అధికారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఐడిబిఐ బ్యాంకుకు చెందిన కొంత మంది ఉన్నతాధికారులను ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ నెల 9వ తేదీన ముంబయిలో తమ ఎదుట హాజరు కావాలని విజయ్ మాల్యాకు శనివారం తాజాగా సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.