బిజినెస్

‘్ఫ్యచర్’ చేతికి హెరిటేజ్ రిటైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్.. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు చెందిన రిటైల్, అనుబంధ వ్యాపారాలను హస్తగతం చేసుకుంది. ఈ మేరకు బియానీ సోమవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. మొత్తం స్టాక్ డీల్‌లో జరిగిన ఈ లావాదేవికి సంబంధించి ఇరు సంస్థల మధ్య ఓ ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందినదే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. ‘హెరిటేజ్ ఫ్రెష్’ బ్రాండ్ పేరిట వివిధ ప్రాంతాల్లో మొత్తం 124 రిటైల్ ఔట్‌లెట్లను ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఇందులో తెలంగాణలోనే సగానికిపైగా ఉండగా, ఇకపై ఈ రిటైల్ స్టోర్లన్నీ ఫ్యూచర్ గ్రూప్‌లో భాగం కానున్నాయి. ఇందుకుగాను ఫ్యూచర్ రిటైల్ నుంచి 295 కోట్ల రూపాయల విలువైన 3.65 శాతం షేర్లు హెరిటేజ్ ఫుడ్స్‌కు వస్తాయని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్ లోకేశ్ నారా తెలిపారు. హెరిటేజ్ డైరీ ఉత్పత్తుల వ్యాపారంతో ఫ్యూచర్ రిటైల్ దేశవ్యాప్తంగా మరింత బలోపేతం కాగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా లోకేశ్ వ్యక్తం చేశారు. రిటైల్, బేకరీ, వ్యవసాయోత్పత్తులు, వెటర్నరీ కేర్ వ్యాపారాలను ఫ్యూచర్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో హెరిటేజ్ ఫుడ్స్ 629.74 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకుంది. మొత్తం హెరిటేజ్ గ్రూప్ టర్నోవర్ గత మార్చి నాటికి 2,387 కోట్ల రూపాయలుగా నమోదైతే, 55 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అయితే హెరిటేజ్ గ్రూప్‌లో రిటైల్ విభాగం మాత్రం నష్టాల్లో ఉండటంతో దీన్ని అమ్మేస్తున్నారు. ఇక ఫ్యూచర్ గ్రూప్ ఇప్పటికే బిగ్ బజార్, ఈ-జోన్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్లతో రిటైల్ రంగంలో దూసుకెళ్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ భారతంలో మంచి నెట్‌వర్క్ ఉన్న హెరిటేజ్ రిటైల్‌నూ సొంతం చేసుకోవడం ద్వారా తమ రిటైల్ వ్యాపారం మరింత బలపడగలదన్న ఆశాభావాన్ని బియానీ వెలిబుచ్చారు. 2021 నాటికి 3 వేల స్టోర్లను ఏర్పాటు చేస్తామన్నారు.