బిజినెస్

అక్టోబర్‌లో పెరిగిన జెఎల్‌ఆర్ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) అమ్మకాలు గత నెల అక్టోబర్‌లో 11 శాతం పెరిగి 46,325 యూనిట్లుగా నమోదయ్యాయి. లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఇవాక్యు, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, జాగ్వార్ ఎఫ్-పేస్ మోడళ్ల అమ్మకాలు బాగున్నాయి. చైనా, యూరప్‌లలోనూ అమ్మకాలు వృద్ధి చెందినట్లు ఓ ప్రకటనలో సోమవారం సంస్థ తెలియజేసింది. నిరుడు అక్టోబర్‌తో పోల్చితే ఈ అక్టోబర్‌లో చైనా అమ్మకాలు 39 శాతం, యూరప్ దేశాల అమ్మకాలు 25 శాతం పెరిగాయంది. బ్రిటన్, ఉత్తర అమెరికాల్లోనూ 8 శాతం పెరిగాయన్న జెఎల్‌ఆర్.. ఇతర దేశాల మార్కెట్లలో మాత్రం 22 శాతం విక్రయాలు పడిపోయాయని చెప్పింది.