బిజినెస్

ద్వైపాక్షిక వాణిజ్యం బలపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: తీవ్ర సంఘర్షణ మధ్య యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బయటకు వచ్చిన బ్రిటన్.. ఇప్పుడు ఆర్థిక సుస్థిరత కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వ్యాపార, వాణిజ్యపరంగా తమ మిత్ర దేశాలతో సంబంధాలను బలపరుచుకోవాలని చూస్తున్న బ్రిటన్.. భారత్‌తో తమ మైత్రిని మరింత పదిలం చేసుకోవాలని ఆశిస్తోంది. ఇందులో భాగంగానే బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా మే రెండు రోజుల భారత పర్యటన జరుగుతోంది. బ్రెగ్జిట్ (యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం) నేపథ్యంలో బ్రిటన్‌కు ప్రధానిగా ఎన్నికైన థెరెసా మే.. భారత్‌లో తొలిసారి పర్యటిస్తుండగా, భారత్-యుకె సిఇఒల మండలి ద్వైపాక్షిక వాణిజ్యం బలపడాలని ఆకాంక్షించింది. భారత్‌లో ఓ అడ్వాన్స్‌డ్ మెటీరియల్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఫోరమ్ నిర్ణయించింది. సోమవారం ఇక్కడ భారత్-యుకె సిఇఒల ఫోరమ్ సమావేశమైంది. ఈ సమావేశ వివరాలను పారిశ్రామిక సంఘం సిఐఐ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇరు దేశాల ప్రభుత్వాలు, పరిశ్రమల నుంచి సమాన భాగస్వామ్యంతో ఈ సెంటర్ ఏర్పాటుకానుంది. ‘్భరత్‌లోని రక్షణ, విమానయాన రంగాలపై ఈ ప్రతిపాదిత సెంటర్ దృష్టి పెడుతుంది.’ అని సిఐఐ స్పష్టం చేసింది. ఈ సెంటర్ ఏర్పాటైతే ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాలకు ఊతమిచ్చినట్లు అవుతుందని కూడా సిఐఐ అభిప్రాయపడింది. ఇక ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతంపైనా ఫోరమ్ ఈ సందర్భంగా చర్చించింది. భారత్‌లో అధికంగా పెట్టుబడులు పెడుతున్న జి-20 దేశాల్లో ముందున్నది బ్రిటనే. అలాగే బ్రిటన్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక ఆ దేశంలో ఉద్యోగాలను అధికంగా కల్పిస్తున్న దేశాల్లో భారత్‌ది ద్వితీయ స్థానం. కాగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామని ఫోరమ్ ప్రకటించింది. అలాగే నూతన వ్యాపార మార్గాలను అనే్వషిస్తామని కూడా స్పష్టం చేసింది. బ్రెగ్జిట్ తర్వాత తొలిసారిగా భారత్-యుకె సిఇఒల ఫోరమ్ ఇప్పుడే సమావేశమవగా, భారత్-యుకె వాణిజ్య, పెట్టుబడుల సంబంధాల బలోపేతానికి ఇది ఓ అవకాశమని, బలమైన బంధాన్ని ఏర్పరచుకునేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్లూ ఫోరమ్ చెప్పింది. బ్రిటన్ యువతలో నైపుణ్యం పెంచడం, భారతీయ పరిశ్రమకు ద్వంద్వ పన్నుల నుంచి మినహాయింపునివ్వడం, పరస్పర అవగాహనతో ముందుకెళ్లేలా వివిధ రంగాల్లో ఒప్పందాలు చేసుకోవడం వంటి వాటిపైనా ఫోరమ్ చర్చలు జరిపింది. ఇదిలావుంటే యూరోపియన్ యూనియన్‌కు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్‌తో సంబంధాలు బలపరుచుకోవడానికి భారతీయ వ్యాపారవేత్తలకు వీసా విధానాన్ని సరళతరం చేసింది బ్రిటన్. ఈ మేరకు సోమవారం ప్రకటించింది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ విద్యార్థులు, రిసెర్చర్లకు సదవకాశాలు కల్పించాలని, భారతీయులకు వీసా విధానాన్ని సులభతరం చేయాలని కోరారు. ఇందుకు మే సానుకూలంగా స్పందించారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం భారత్‌కు కలిసొచ్చే అంశంగా అభివర్ణించారు భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్. వివిధ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచుకునే వెసులుబాటు బ్రిటన్‌కు లభించిందని పేర్కొన్నారు. సిఐఐ నిర్వహించిన భారత్-యుకె టెక్ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇకపోతే ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకున్న టాటా గ్రూప్‌ను బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన ప్రసంగంలో ప్రస్తావించారు. బ్రిటన్‌లో 800లకుపైగా భారతీయ వ్యాపారాలున్నాయని, టాటా గ్రూప్ మాత్రం అత్యధిక బ్రిటనీయులకు ఉపాధి కల్పిస్తోందన్నారు. ఉక్కు, ఆటో, ఐటి రంగాల్లో టాటా సంస్థలు బలమైన వ్యవస్థలుగా ఉన్నాయని గుర్తుచేశారు. ఫోర్డ్ నుంచి 2.3 బిలియన్ డాలర్లకు జెఎల్‌ఆర్‌ను టాటా మోటార్స్ కొనుగోలు చేయగా, ఇది జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత ఈ జనవరిలో బ్రిటన్ కార్ల అమ్మకాల్లో జెఎల్‌ఆర్ అగ్రస్థానాన్ని అందుకుంది. ఇకపోతే బ్రిటన్‌కు చెందిన అప్లియెనె్సస్ సంస్థ డైసన్.. భారతీయ మార్కెట్‌లోకి వస్తున్నట్లు ప్రకటించింది. రిటైల్ నెట్‌వర్క్‌లో రాబోయే 3-5 ఏళ్లలో 124.32 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని స్పష్టం చేసింది. ఈ మేరకు పిటిఐకి సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇంజినీర్ సర్ జేమ్స్ డైసన్ తెలిపారు. కాగా, థెరిసా మే పర్యటన సందర్భంగా బ్రిటన్ టెలికామ్ దిగ్గజం వొడాఫోన్ పన్ను వ్యవహారం తెరపైకి వచ్చింది. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని, అది ఇరు దేశాలకు మంచిదని బ్రిటన్ అభిప్రాయపడింది. ఇదిలావుంటే భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి బ్రిటన్ అమితాసక్తిని ప్రదర్శిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు భారత్-యుకె ఆర్థిక భాగస్వామ్యం సారథులు ఉదయ్ కొటక్, జెర్రి గ్రిమ్‌స్టోన్‌లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు.

చిత్రం.. .భారత్-యుకె సిఇఒల మండలి సభ్యులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని థెరెసా మే