బిజినెస్

నేడు ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ వ్యాపార ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 36వ అఖిల భారత అంతర్జాతీయ వ్యాపార ప్రదర్శనలో తెలంగాణ పెవిలియన్ ‘డిజిటల్ తెలంగాణ’ థీమ్ డిజైన్‌తో ముస్తాబైంది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఈ ప్రదర్శనను ప్రారంభిస్తుండగా, తెలంగాణ పెవిలియన్‌ను రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆవిష్కరిస్తున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఎగ్జిబిషన్‌కు ‘డిజిటల్ ఇండియా’ థీమ్ నిర్ణయించంతో తెలంగాణ ప్రభుత్వం కూడా తమ పెవిలియన్‌ను అదే తరహా థీమ్‌తో రూపొందించింది. ఇక టి-హబ్‌తోపాటు ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ రంగాల్లో తాము సాధించిన ప్రగతిని తెలంగాణ పెవిలియన్‌లో ప్రదర్శిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇదిలావుంటే ఈసారి ఎగ్జిబిషన్‌లో భాగస్వామ్య దేశంగా దక్షిణ కొరియా ఉంది. మధ్యప్రదేశ్ భాగస్వామ్య రాష్ట్రంగా వ్యవహరిస్తోంది. ఫోకస్ దేశం బెలారస్ అవగా, ఫోకస్ రాష్ట్రం హర్యానాగా ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు మొత్తం 27 దేశాలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటున్నాయి. దేశ, విదేశాలకు చెందిన వందలాది ప్రముఖ కంపెనీలు ఎగ్జిబిషన్‌లో తమ వస్తువులను స్టాల్స్ ద్వారా ప్రదర్శిస్తున్నాయి.