బిజినెస్

రామగుండం, పరవాడ ఎన్‌టిపిసిలకు స్వర్ణశక్తి పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని/పరవాడ, నవంబర్ 13: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, విశాఖపట్నం జిల్లాలోని పరవాడలోగల ఎన్‌టిపిసికి చెందిన థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లకు స్వర్ణశక్తి పురస్కారాలు లభించాయ. సామాజిక సేవ, మానవ వనరులు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, భద్రత, ఉత్పాదకత, పర్యావరణం, రాజభాష అభివృద్ధి, సిఎస్‌ఆర్ వంటి విభాగాల్లో దేశవ్యాప్తంగా ఎన్‌టిపిసి పరిధిలోని ప్రాజెక్ట్‌లకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో రామగుండం, పరవాడ ప్రాజెక్ట్‌లకు పురస్కారాలు దక్కాయ. రామగుండం ఎన్‌టిపిసి ఇడి ప్రశాంత్ కుమార్ మహాపాత్ర, సింహాద్రి గ్రూప్ జిఎం ప్రవీణ్ కుమార్ బోంద్రియాలు ఎన్‌టిపిసి సిఎండి గురుదీప్ సింగ్ చేతులమీదుగా ఢిల్లీలో ఆదివారం ఈ పురస్కారాలు తీసుకున్నారు.

చిత్రాలు..పురస్కారాలను అందుకుంటున్న ప్రవీణ్ కుమార్ బోంద్రియా, ప్రశాంత్ కుమార్ మహాపాత్ర