బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ఫెడ్ రిజర్వ్ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. వచ్చే నెల నిర్వహించే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్ల పెంపు ఉండొచ్చన్న సంకేతాలను అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ ఇవ్వడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 77.38 పాయింట్లు నష్టపోయి 26,150.24 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 5.85 పాయింట్లు కోల్పోయి 8,074.10 వద్ద నిలిచింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణించడమూ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్, టెక్నాలజీ, ఐటి, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 1.26 శాతం నుంచి 0.30 శాతం మేర పడిపోయాయి. అయితే చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, రియల్టీ, పవర్, యుటిలిటీస్, ఎనర్జీ రంగాల షేర్లు 1.45 శాతం నుంచి 1.06 శాతం వరకు పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్లలో చైనా సూచీ నష్టపోగా, జపాన్, హాంకాంగ్ సూచీలు లాభపడ్డాయి. ఐరోపా మర్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు పతనమయ్యాయి. ఇదిలావుంటే ఈ వారం మొత్తంగా భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కదలాడగా, సెనె్సక్స్ 668.58 పాయింట్లు, నిఫ్టీ 222.20 పాయింట్లు దిగజారాయి.