బిజినెస్

‘రద్దు’పై పేలుతున్న సెటైర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: పెద్ద నోట్లను రద్దుచేసి పది రోజులు గడిచి పోయినా బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూలు మాత్రం తగ్గట్లేదు. అదే విధంగా సామాజిక మాధ్యమాల్లోనూ కరెన్సీ సమస్యలపై సెటైర్ల జోరు ఆగట్లేదు. గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బంది పడుతున్న నెటిజన్లు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు మరి. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన కోసం 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఈ నెల 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో భారీ స్థాయలో అనుకూలంగా కామెంట్స్ కనిపించినా.. రోజులు గడుస్తున్నకొద్దీ, ఇబ్బందులు పడుతున్నకొద్ది క్రమంగా వ్యంగ్యోక్తులు మొదలయ్యాయి.
మరోవైపు ఇదే సమయంలో బిజెపి కార్యకర్తలూ నెటిజన్లపై విమర్శల దాడులకు దిగుతున్నారు. కాగా, నోట్ల వ్యవహారం సమాజంపై తీవ్రంగానే ప్రభావం చూపిస్తోంది. అందుకే సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు విపరీతంగా పెరిగిపోగా, నెటిజన్లు తమ వ్యంగ్యోక్తులకు మరింత పదును పెడుతున్నారు.
కొన్నింటిని గమనిస్తే..
అబ్బాయి అంధ్రా బ్యాంకులో ఉన్నాడు.
చిన్నమ్మాయి ఐడిబిఐ, పెద్దమ్మాయి ఐసిఐసిఐలో ఉన్నారు.
మా వారు ఓరియంటల్ బ్యాంకు, నేను కొటక్ మహీంద్ర బ్యాంకు అంటూ తన గురించి తాను చెప్పుకోగానే
ఎదుటి మహిళ.. భలే కుటుంబం ఇంట్లో అంతా బ్యాంకు
ఉద్యోగాలు సంపాదించారే అని అభినందిస్తుంది.
దానికి ఆమె ఉద్యోగమా? పాడా.. పాత నోట్లను మార్చుకునేందుకు అంతా పనులు మానుకుని ఆయా బ్యాంకుల ఎటిఎం క్యూల్లో నిలబడ్డాం అని బదులిస్తుంది.
బారులు తీరిన క్యూ లైన్లపైనా నెటిజన్లు వినూత్నంగా ఛలోక్తులు విసురుతున్నారు.
భాయ్ సాబ్.. దగ్గరలో ఎస్‌బిహెచ్ బ్యాంకు ఉందా?
రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
నడుచుకుంటూ వెళ్లవచ్చా?
ఎందుకూ నా వెనక నిలబడండి.
నేను ఎస్‌బిహెచ్ బ్యాంకు క్యూలోనే ఉన్నాను.
అయతే సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పెరిగిపోవడంతో మోదీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సైన్యం సరిహద్దుల్లో మన కోసం కాపాలా కాయడం లేదా? అంటూ సమాధానాలు ఇస్తున్నారు. దాంతో ఈ సమాధానాలపై కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయ.
పరేషాన్ చేస్తున్నారు?
సైనికులు మన కోసం సరిహద్దుల్లో కాపలా కాయడం లేదా?
నువ్వు సైనికుడివా? కాదు..
అరే ఓ పిచ్చోడా! నేను సైనికునే్న క్యూలో ఈ శిక్ష ఏంటి?
మరోవైపు రాహుల్ గాంధీ ఎటిఎం క్యూలో నిలబడి 4 వేలు తీసుకోగా, తరువాత మోదీ తల్లి కూడా క్యూలో నిలబడి 4 వేలు తీసుకున్నారు. దీనిపైనా నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందించారు.
తల్లిని క్యూలో నిలబెట్టాడు కానీ..
అంబానీని క్యూలో నిలబెట్టలేకపోయాడు అని.
నోట్ల రద్దుతో సామాన్యుల సమస్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గళమెత్తడంతో ఆమెను బిజెపి వాళ్లు విలాసినీ (చీర్‌గర్ల్) అని విమర్శించారు. దీనిపై నెటిజన్లు మమత నివసించే ఇంటి విలువ కన్నా మోదీ ధరించే చొక్కా ఖరీదు ఎక్కువ అని గుర్తు చేశారు.
500-1,000-2,000 ఇందులో పెద్ద అంకె ఏది? అని ప్రశ్నిస్తే సాధారణ లెక్కల్లో అయితే 2 వేలు పెద్ద సంఖ్య, రాజకీయాల్లో అయితే 500-1000 కన్నా 2 వేలు చిన్న సంఖ్య. అవును మరి. నల్లధనం నిర్మూలన కోసం పెద్ద నోట్ల రద్దు అని ఒకవైపు చెబుతూ మరోవైపు రద్దయిన వాటి కన్నా పెద్ద నోటును తీసుకురావడం అలాగే అనిపిస్తోందిప్పుడు. దీనిపైనా తమదైన శైలిలో నెటిజెన్లు విసుర్లు విసురుతున్నారు.
ఓ దొంగ దొంగతనానికి ఇంట్లోకి వెళ్లాడు.
ఇంట్లో వాళ్లు అందరూ నిద్రలో ఉన్నారు.
చూస్తే 500-1,000 రూపాయల నోట్లు మాత్రమే ఉన్నాయి. కోపం వచ్చిన దొంగ ఇంట్లో అందరి ముఖాలకు
నల్ల రంగు పూసి వెళ్లిపోయాడు.
నల్లధనానికి, తన నిరసనకు కలిపి నల్ల రంగును పులిమాడన్నమాట.
మొత్తానికి నోట్ల రద్దు, దాంతో ప్రజల సమస్యలు, ఎటిఎంల వద్ద క్యూల వంటి సమస్యలపై నెటిజన్లు రెండుగా విడిపోయి హోరాహోరిగా వాదనలు సాగించుకుంటున్నారు. రాష్ట్ర విభజన డిమాండ్ మధ్య తెలంగాణ, సమైక్యాంధ్ర వాదం తరువాత సామాజిక మాధ్యమాల్లో అంత తీవ్ర స్థాయిలో వాదనలు జరుగుతున్న అంశం నోట్ల రద్దే.