బిజినెస్

డేటావిండ్ పరిశ్రమ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో డేటావిండ్ మొబైల్ ఫోన్ల తయారీ, ట్యాబ్‌లెట్ తయారీ కేంద్రాన్ని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణలో మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్ మొబైల్ కంపెనీలు తమ తయారీ కేంద్రాలను ప్రారంభించాయి. ఇప్పుడు మరో ప్రముఖ సంస్థ మొబైల్ తయారీ పరిశ్రమ స్థాపించడంతో తెలంగాణలో మొబైల్ కంపెనీలకు మంచి అవకాశాలు ఉన్నట్టు స్పష్టం అవుతోందని కెటిఆర్ తెలిపారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముందు చూపుతో తీసుకున్న పలు నిర్ణయాలు తెలంగాణలో పరిశ్రమలు పెద్ద ఎత్తున రావడానికి దోహదం చేస్తున్నాయన్నారు. టిఎస్ ఐపాస్ చట్టం ప్రపంచ పారిశ్రామిక రంగం దృష్టిని ఆకర్షించిందన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డేటావిండ్ కంపెనీ ఈ పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమను కెనడా రాయబారి నాదిర్ పటేల్‌తో కలిసి కెటిఆర్ ప్రారంభించారు. ఇప్పటికే ఈ పరిశ్రమలో ఆరు వందల మందికి ఉపాధి లభించిందని, ఇది మరింతగా పెరుగుతుందన్నారు. పదిహేను రోజుల్లో పరిశ్రమల స్థాపనకు అవకాశం ఇవ్వడం వల్ల చక్కని ఫలితాలు వస్తున్నాయని కెటిఆర్ తెలిపారు.

చిత్రం.. డేటావిండ్ ఉత్పాదక కేంద్రం ప్రారంభోత్సవంలో కెటిఆర్