బిజినెస్

ఉల్లికి గిట్టుబాటు ధరేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 19: రైతు ప్రభుత్వాలని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయని పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. శనివారం కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులను కలిసి, వారు ఎదుర్కొంటున్న కష్టాలను ఖర్గే తెలుసుకున్నారు. దేశంలో మహారాష్ట్ర, కర్నాటక తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే రైతులు ఉల్లిపంట ఎక్కువగా సాగు చేస్తున్నారని, మార్కెట్ యార్డుల్లో దళారుల చేతిలో ఉల్లి రైతు నలిగిపోతున్నా పాలకులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించి పెద్ద నోట్లను రద్దు చేయటంతో ఉల్లి రైతుకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయన్నారు.
దేశంలో 86 శాతం వ్యాపార లావాదేవీలు 500, 1,000 రూపాయల నోట్లతోనే జరుగుతాయన్నారు. అలాంటిది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా పెద్ద నోట్లను అమాంతం రద్దు చేసిందని విరుచుకుపడ్డారు. దీంతో చిల్లర సమస్య కారణంగా ఉల్లి ఉత్పత్తుల కొనుగోలుకు వ్యాపారులు ఎవ్వరూ ముందుకు రావటం లేదన్నారు. ఫలితంగా రోజుల తరబడి మార్కెట్‌లో ఉల్లిపంటను నిల్వ చేయడం వల్ల దళారులు కుమ్మకై తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు ఎత్తుగడ వేస్తున్నారన్నారు.
కనీసం పంట సాగు ఖర్చులు రాక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు దిక్కతోచని స్థితిలో ఉన్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసి, వారికి అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వాలు చేసింది శూన్యమన్నారు. ఓట్ల కోసం రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిం చి ఉల్లిపంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎంపి కెవిపి రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి, ఎఐసిసి రాష్ట్ర పరిశీలకుడు కుంతీయా, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు ఉన్నారు.

చిత్రం.. కర్నూలు మార్కెట్ యార్డులో మల్లికార్జున ఖర్గే, రఘువీరా రెడ్డి తదితరులు