బిజినెస్

‘పవర్’ పంచాయతీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 19: అది ముఖ్యమంత్రి అధీనంలోని శాఖ. రాష్ట్ర అవసరాలతోపాటు మిగిలిన అన్ని శాఖలకు విద్యుత్ పంపిణీ చేసే శాఖ అది. అయతే వేల కోట్లు బకాయిలు పడిన సర్కారు శాఖలపై విద్యుత్ శాఖ కొరఢా ఝుళిపిస్తోంది. బిల్లులు కట్టకపోతే నిర్మొహమాటంగా కట్ చేస్తామని ట్రాన్స్‌కో బాస్ అజయ్ జైన్ హెచ్చరించారు మరి. ఇదిప్పుడు కలెక్టర్లకు మింగుడుపడటం లేదు. ఆర్ధిక శాఖ నిధులివ్వకపోతే మేమేం చేయాలన్నది వారి ప్రశ్న. ఆ సంగతి మాకు అనవసరం, మా బిల్లులు మాకు చెల్లించాల్సిందేనని ట్రాన్స్‌కో బాసు ఆర్డరేస్తున్నారు. మరోవైపు ఈ పంచాయతీ వల్ల పవర్ కట్టయిపోతే సర్కారుకే నష్టమన్నది మంత్రుల ఆవేదన. ముఖ్యమంత్రి అన్ని శాఖలకూ అధిపతి. మరి ఆయన ఎటువైపు నిలుస్తారు? నిధులిచ్చి కలెక్టర్లను ఆదుకుంటారా? లేక ట్రాన్స్‌కో బాసుకు ఎప్పటిమాదిరిగా స్వేచ్ఛ ఇస్తారా?.. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో నడుస్తున్న పవర్ పంచాయతీ ఇది.
తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటేనని ట్రాన్స్‌కో చీఫ్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేస్తున్నారు. ట్రాన్స్‌కోకు బకాయిపడ్డ ప్రభుత్వ శాఖలు బిల్లులు చెల్లించకపోతే నిర్మొహమాటంగా వాటి కనెక్షన్ తొలగించాలని అజయ్ జైన్ ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వ శాఖలకు-ట్రాన్స్‌కోకు మధ్య వార్ మొదలయినట్టయింది. బయట తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని, నష్టం భరించలేకపోతున్నందున ప్రభుత్వ శాఖల నుంచి కచ్చితంగా బకాయి బిల్లును వసూలు చేయాలని ట్రాన్స్‌కో చీఫ్ అజయ్ జైన్ తాజాగా నిర్వహించిన విద్యుత్‌శాఖ అధికారుల సమీక్షలో తేల్చి చెప్పారు. అయతే దీనిపై జిల్లా కలెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అజయ్ జైన్ కూడా ఒకప్పుడు కలెక్టర్‌గా పనిచేసిన అధికారేనని వారు గుర్తు చేస్తున్నారు. తమకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదని, అందుకే ట్రాన్స్‌కోకు బిల్లులు కట్టలేకపోతున్నామని వాదిస్తున్నారు. కంటినె్జన్సీ ఫండ్స్ సకాలంలో విడుదల కానందుకే విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతున్నామే తప్ప, కావాలని ఎందుకు పెండింగ్ పెడతామని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అజయ్ జైన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయని ఓ కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని, రేపు స్కూ ళ్లు, ఆసుపత్రులకు కరెంట్ కనెక్షన్లు కట్ చేస్తే జనం ముందు దోషులయ్యేది మేమే అయినా అంతిమంగా అది ప్రభుత్వానికే నష్టమని ఆ కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఇంతకూ ఈ పంచాయతీకి అసలు కారణం నిధుల విడుదలలో ప్రభుత్వం అనుసరిస్తోన్న అలసత్వంతోపాటు, ఆర్థిక శాఖ అధికారుల నిర్లక్ష్యమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో అటు ట్రాన్స్‌కో, ఇటు కలెక్టర్లు ఎవరికి వారు అనుకూలంగానే తమ వాదనలను వినిపిస్తున్నారు. ట్రాన్స్‌కోకు వివిధ ప్రభుత్వ శాఖలు వేల కోట్లలో బకాయిలు పడ్డాయని, వాటి విలువ 2 వేల కోట్ల రూపాయల పైమాటేనని, అం దులో వైద్య ఆరోగ్య, విద్య, సాంఘిక సంక్షేమ శాఖ బకాయిలే అధికంగా ఉన్నాయని ట్రాన్స్‌కో వర్గాలు చెబు తున్నాయ. మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్తులు, పంచా యతీల విద్యుత్ బిల్లులదీ అదే దారి. అసలు బకాయిలన్నీ ఈ శాఖల నుంచే ఎక్కువ శాతం రావలసి ఉంది. స్థానిక సంస్థల బకాయిలు 1,451 కోట్ల రూపాయలు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రణాళిక అమలులో వాడిన విద్యుత్తుకు 162 కోట్ల రూపాయలు రావలసి ఉంది. ఇవిగా కుం డా ప్రభుత్వం నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టులు, బిల్డింగుల నుంచీ భారీ స్థాయిలో బకాయిలు రావాలి. అయతే కోల్ ఇండియా నుంచి తీసుకుంటున్న బొగ్గు చెల్లింపు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న 500 కోట్ల రూపాయలు, ప్రైవేటు కంపెనీ నుంచి తీసుకుంటున్న విద్యుత్‌కు వడ్డీలు చెల్లించాలి కాబట్టి, ఆ మాత్రంగా కఠినంగా ఉండాల్సి వస్తోందని ట్రాన్స్‌కో చెబుతోంది. కాగా, మంత్రులు సైతం అజయ్ జైన్ ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలే తప్ప, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే నిర్ణయాలు తీసుకుంటే ఎలా అంటున్నారు.

చిత్రం.. అజయ్ జైన్ (ఏపి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి)