బిజినెస్

వేతన జీవులను, చిరు వ్యాపారులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వేతన జీవులు, చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని వాణిజ్య సంఘాలు కోరాయి. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన కోసం ఈ నెల 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. కాగా, శనివారం ఇక్కడ వాణిజ్య, వ్యవసాయ సంఘాలతో జైట్లీ ప్రీ-బడ్జెట్ సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే చర్చ సందర్భంగా నోట్ల రద్దు వ్యవహారంపై తాము స్పందించినట్లు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ అధ్యక్షుడు తపన్ సేన్ విలేఖరులకు తెలిపారు. మరోవైపు ఉద్యోగులు, పెన్షనీర్ల ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఈ చర్చలో మొత్తం 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు పాల్గొన్నాయి. ఇదిలావుంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధిక దిగుబడి వచ్చే వంగడాలతో వ్యవసాయోత్పత్తిని పెంచుకోవాలని రైతులకు జైట్లీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వ్యవసాయ, రైతు ప్రోత్సాహకాల సమీక్షలో మాట్లాడుతూ 2022 నాటికి వ్యవసాయోత్పత్తి, రైతుల ఆదాయం రెండింతలు కావాలన్నారు.

చిత్రం.. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా శనివారం న్యూఢిల్లీలో వాణిజ్య సంఘాల ప్రతినిధులతో జైట్లీ చర్చలు