బిజినెస్

ఎగుమతిదారులతో నేడు సీతారామన్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై ఎగుమతిదారులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం సమావేశమవుతున్నారు. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతోపాటు ఎగుమతి రంగానికి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఈ నెల 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసినది తెలిసిందే. వాటి స్థానంలో కొత్త 500, 2,000 రూపాయల నోట్లను చెలామణిలోకి తీసుకువచ్చినది విదితమే. అయితే డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక, 100 నోట్లు లభించక వ్యాపారాలు కుదేలైపోయినది తెలిసిందే. ఇప్పటికే దీనిపై వాణిజ్య సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఎగుమతులపై రద్దు ప్రభావం ఎలా ఉందనే వివరాలను సోమవారం నాటి సమావేశంలో మంత్రి తెలుసుకోనున్నారు. కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ రఫీక్ అహ్మద్ స్పందిస్తూ పాత పెద్ద నోట్ల రద్దుతో నగదు ఉపసంహరణలపై పరిమితి వచ్చిందని, దీంతో పెట్టుబడుల కొరతను ఎదుర్కొంటున్నామని అన్నారు. ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలను చెల్లించలేకపోతున్నామని కూడా ఆయన చెప్పారు. గత నెల అక్టోబర్‌లో దేశీయ ఎగుమతులు 9.59 శాతం పెరిగి 23.51 బిలియన్ డాలర్లుగా నమోదైనది తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) 280 బిలియన్ డాలర్లకు భారత ఎగుమతులు చేరాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇవి 261.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.