బిజినెస్

కల్తీ వ్యాపారంపై కఠినంగా వ్యవహరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 21: ప్రజల ఆరోగ్యానికి నష్టం జరిగేలా వ్యాపారులు ఆహార పదార్థాల్లో కల్తీచేసి విక్రయిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. సోమవారం గుంటూరు జెడ్పీ సమావేశ మందిరంలో శీతల గిడ్డంగుల నిర్వాహకులు, కారం మిల్లుల యజమానులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అన్యాయం జరిగినా, ప్రజల ఆరోగ్యానికి హాని తలపెట్టి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చైనాలో తయారుచేసే కారాన్ని తక్కువ ధరకు కొని, దాన్ని దేశీయ కారంలో కలిపి విక్రయిస్తున్నట్లు ఇటీవల జరిగిన నిఘా బృందాల దాడుల్లో వెల్లడైందన్నారు. గుంటూరు మిర్చికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, దాన్ని కల్తీ కారంతో దెబ్బతీయాలని చూస్తే ఉపేక్షించబోమన్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.