బిజినెస్

ఎగుమతిదారులకు నగదు ఉపసంహరణ పరిమితి పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: ఎగుమతిదారులకు నగదు ఉపసంహరణ పరిమితి పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని అడుగుతానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ ఎగుమతి ప్రోత్సాహ మండళ్లతో గంటపాటు జరిపిన సమావేశం అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో ఎగుమతిదారులకు తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు నగదు ఉపసంహరణకు అనుమతించాలని ఎగుమతిదారులు తనను కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం వారానికి 50,000 రూపాయలు మించి నగదు ఉపసంహరణకు అనుమతి లేదన్నది తెలిసిందే. ఈ క్రమంలో ఎగుమతిదారుల డిమాండ్ న్యాయమైనదేనని, నగదు ఉపసంహరణ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నగదు కొరతతో వ్యాపారాలు, ఎగుమతుల లావాదేవీలు దెబ్బతింటున్నాయని ఎగుమతిదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.