కృష్ణ

స్ర్తి సంక్షేమమే సంఘ క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, మార్చి 8: స్ర్తి సంక్షేమంలోనే సంఘ క్షేమం ఇమిడి ఉందని వక్తలు అన్నారు. ఇంద్రకీలాద్రి శ్రీ మల్లిఖార్జున మహామండపంలో బుధవారం ఉదయం తొలిసారిగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా దుర్గగుడిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఇవోతో పాటు అన్ని క్యాడర్‌లకు చెందిన ఉద్యోగులు ఒకరోజు వేత నాన్ని దుర్గగుడికి విరాళంగా ప్రకటించారు. పిన్నమనేని మెడికల్ కళాశాల ప్రొఫెసర్ మాదల పార్వతీదేవి, దుర్గగుడిలోని వివిధ సెక్షన్‌ల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మహిళ ఉద్యోగులు వివిధ రకాలైన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు.
అన్ని రంగాల్లో ముందంజ
బెంజిసర్కిల్ : మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, మహిళలు తలచుకుంటే ఏ రంగంలో అయినా విజయం సాధించగలరని చెస్‌గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బృందావన్ కాలనీలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్నారని తెలియజేశారు. ముఖ్యంగా మహిళలు తాము తక్కువ అనే భావనలో ఉంటూ నిరుత్సాహం పడకూడదని, మహిళా శక్తికి ఎంత గుర్తింపు ఉందో తెలియజేశారు. నేడు సామాజిక, ఆర్థిక, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక రంగాలలోను మరీ ముఖ్యంగా క్రీడా రంగంలో మహిళలు రానిస్తూ భారత ఔన్నత్యాన్ని చాటుతున్నారని తెలిపారు. మహిళలు ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నా నిరుత్సపరిచే వారు కొంతమంది ఉంటారని అటువంటి వారికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నారు. తనను చాలామంది నిరుత్సాహపర్చిన, తల్లిదండ్రులు ప్రోత్సహంతో అగ్రస్థానానికి వెళ్లి, నేడు ఈ స్థితిలో ఉన్నానని తెలియజేశారు. మహిళలకు ప్రోత్సాహం ఉందని, ఎల్లప్పుడు ఉంటుందన్నారని ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ భవాని శ్రీనివాస్ అన్నారు.

పోర్టుకు శ్రీ సీతారాముల వారి భూముల అప్పగింత
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 8: బందరు పోర్టు, కోస్టల్ కారిడార్ ఏర్పాటుకై మండల పరిధిలోని పోతేపల్లి గ్రామ శివారు పోతిరెడ్డిపాలెంలో వేంచేసియున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన 41 ఎకరాల 66 సెంట్ల భూమిని భూసమీకరణలో ఇచ్చేందుకు బుధవారం మడ డెప్యూటీ కలెక్టర్ కె ధర్మారావుకు అంగీకార పత్రాలు అందజేశారు. దేవస్థానం భూములతో పాటు మరో మూడు ఎకరాల 16 సెంట్ల భూమికి సంబంధించి కూడా అంగీకార పత్రాలు అందజేశారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య) చేతుల మీదుగా అంగీకార పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొర్రా సాయిబాబు, టిడిపి నాయకులు కమ్మిలి మధుసూదనరావు, కాగిత ఏడుకొండలు, బండి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.