23నుండి ‘సైరా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇదివరకే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రెండో షెడ్యూల్‌ను ఈనెల 23నుంచి మొదలుపెట్టనున్నారట. బాహుబలి తరువాత ఆ రేంజ్‌లో అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించే ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు. ఈనెల నుండి జరిగే రెండో షెడ్యూల్ ఏకధాటిగా జరుపుతారని, ఇందులో హీరోయిన్ నయనతారతోపాటు అమితాబ్‌బచ్చన్ కూడా పాల్గొంటారని తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడి అనే్వషణ సాగుతోంది. ఇదివరకే సంగీత దర్శకుడిగా రెహమాన్ పేరును ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణావల్ల ఆయన తప్పుకున్నట్లు తెలిసింది. దాంతో ఆయన స్థానంలో కీరవాణి లేక ఇళయరాజాను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.