23న శ్రీకాంత్ ‘రారా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో శ్రీకాంత్, నాజియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రారా’. శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలవుతుంది. విజీ చెర్రిష్ దర్శకుడు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, నాని, తరుణ్, రఘుబాబు, అలీ, హేమ, సదానంద్, నిర్మాత అశోక్, ప్రతాప్, ఖయ్యుమ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. నాని మాట్లాడుతూ ‘‘నాకు అష్టాచెమ్మా నుండి శ్రీకాంత్‌తో మంచి పరిచయం ఉంది. నటుడిగా ఆయనేంటో అందరికీ తెలుసు. ఇప్పుడు హారర్ మూవీ రా..రా చేస్తున్నారు. ఈ సినిమా ఆయనకు మరో పెద్ద హిట్ చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. తరుణ్ మాట్లాడుతూ ‘‘శ్రీకాంత్ 125వ సినిమా ఇది. అందరూ కమెడియన్స్ కలిసి ఈ సినిమాలో నటించారు. సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాత శ్రీమిత్ర చౌదరి మాట్లాడుతూ ‘‘శ్రీకాంత్‌తో 24 సంవత్సరాల అనుబంధం ఉంది. నా స్వంత బ్రదర్‌లాంటి వ్యక్తి. ఈ కథ విన్న తర్వాత విజయ్ డైరెక్ట్ చేయాలని అనుకున్నాం. శ్రీకాంత్ వంటి సీనియర్ హీరో ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. నిర్మాత విజయ్ మాట్లాడుతూ ‘‘శ్రీకాంత్‌తో ఉన్న అనుబంధంమే ఈ సినిమా చేయడానికి మమ్మల్ని ముందుకు నడిపించింది. సినిమా బాగా వచ్చింది. ఈనెల 23న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా ఎంటర్‌టైనింగ్‌గా ఆకట్టుకుంటుంది’’ అన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘నాని, తరుణ్‌లకు నా స్పెషల్ థాంక్స్. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. హారర్ జోనర్‌లో నేను చేసిన తొలి సినిమా ఇది. హారర్ సినిమాలు చాలానే ఉన్నా.. ఈ సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది. ఈ 23న విడుదలవుతున్న ఈ సినిమా నాకు మంచి విజయాన్ని అందిస్తుందనే నమ్మకం ఉంది. నిర్మాతలు విజయ్, శ్రీమిత్ర చౌదరిలకు థాంక్స్’’ అన్నారు.