ఆటాపోటీ

క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ ఫిక్సింగ్ మాయ భారత క్రికెట్‌నేగాక, యావత్ ప్రపంచ క్రికెట్ రంగాన్ని అతలాకుతలం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయ. ముకుల్ ముద్గల్ అధ్యక్షతన సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రెండు దఫాలుగా దర్యాప్తును నిర్వహించి సమర్పించిన నివేదికలను పరిశీలించిన సుప్రీం కోర్టు దోషులకు శిక్షను ఖరారు చేసే బాధ్యతను ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ కూడా విచారణ జరిపి, పలువురి అభిప్రాయాలు సేకరించి తీర్పును ప్రకటించింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా స్పాట్ ఫిక్సింగ్ నేరంపై అరెస్టయిన తర్వాత బాలీవుడ్ నటుడు విందూ రణ్‌ధావాను ముంబయి క్రైమ్ బ్రాంచ్ అధికారులు బెట్టింగ్ ఆరోపణలపై అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ సమయంలో శ్రీనివాసన్ అధినేతగా ఉన్న ఇండియా సిమెంట్స్ కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు సిఇవోగా వ్యవహరించిన గురునాథ్ మెయప్పన్ తరఫున తాను పందాలు కాసేవాడినని రణ్‌ధావా వాంగ్మూలమిచ్చాడు. శ్రీనివాసన్‌కు అల్లుడైన మెయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాలపై జీవితకాల సస్పెన్షన్ వేటు పడింది. అదే విధంగా శ్రీశాంత్, చవాన్‌లతోపాటు తాజాగా చండీలాను కూడా బిసిసిఐ జీవితకాలం క్రికెట్ నుంచి నిషేధించింది. చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలపై రెండేళ్ల నిషేధాన్ని విధించింది. లోధా కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్నో ప్రతిపాదనలు చేసింది. ఇవి అమలైతే, భారత క్రికెట్ ప్రక్షాళన సాధ్యమవుతుంది.