గుమ్మడికాయ కొట్టేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న సీనియర్ నటి సావిత్రి జీవిత కథతో ‘మహానటి ’ పేరుతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత ప్రియాంకాదత్ మాట్లాడుతూ- మా టెక్నికల్ టీం ఎంతో నేర్పుతో క్రియేట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఎరా ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా అద్భుతమైన సినిమాటిక్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. ఏ విషయంలోనూ రాజీపడకుండా ఇంత అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీర్తి సురేష్, సమంత, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, షాలినీ పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, అవసరాల శ్రీనివాస్, దర్శకుడు క్రిష్, తరుణ్ భాస్కర్ వంటివాళ్లు నటిస్తున్నారు. అక్కినేని పాత్రలో నటిస్తున్న చైతన్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. సినిమా పూర్తయ్యింది. సావిత్రి పటం వద్ద గుమ్మడి కాయ పూజతో షూటింగ్ పూర్తిచేశాం. ఈ చిత్రం మే 9న విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని మిగులుస్తుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, ఆర్ట్: అవినాష్, కెమెరా: డానీ, ఆర్ట్‌సూపర్‌వైజర్: తోట తరణి, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: ప్రియాంకా దత్, దర్శకత్వం: నాగ అశ్విన్.