జాతీయ వార్తలు

చితాభస్మం తేవొద్దని పీవీ సర్కార్ నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: తైవాన్ విమాన ప్రమాదంలో మృతి చెందిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చితాభస్మాన్ని తీసుకు రావాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని 1995 ఫిబ్రవరిలో అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేతాజీ చితాభస్మం టోక్యోలోని రెంకోజి ఆలయంలో ఉంది. ప్రధాని విడుదల చేసిన డిజిటల్ రూపంలోని వంద ఫైళ్లలో ఈ డాక్యుమెంట్ కూడా ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చెందిన చితాభస్మాన్ని భారత్‌కు తీసుకు రావాలన్న నిర్ణయాన్ని కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ వాయిదా వేసుకుంది. అంతేకాక దీనికోసం అప్పటి హోం శాఖ సూచించిన మూడు ప్రత్యామ్నాయాలపై నిర్ణయాన్ని కూడా వాయిదా వేసుకుంది. ఈ సూచనలకు అప్పటి కేంద్ర హోంమంత్రి శంకర్‌రావు చవాన్ ఆమోదంఉంది. ఆలయంలోనే చితాభస్మాన్ని ఉంచాలని, దాని నిర్వహణకోసం అయ్యే ఖర్చును భరిస్తామని కోరాలనేది ఈ సూచనల్లో ఒకటి కాగా భారత్‌కు చితాభస్మాన్ని తీసుకు రావడం, లేదా చితాభస్మాన్ని టోక్యోలోని భారత దౌత్య కార్యాలయంలో ఉంచడం మిగతా రెండు ప్రతిపాదనలు. నేతాజీ చితాభస్మాన్ని తీసుకు రావాలా వద్దా అనే డైలమాలో పీవీ ప్రభుత్వం పడిందని ఆ డాక్యుమెంట్ పేర్కొంది. హోం శాఖ ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలు చేసినా, చితాభస్మాన్ని తీసుకు రావాలని ఏ వర్గంనుంచి డిమాండ్ లేనందున ఈ సమయంలో వెనక్కి తీసుకు రావడం మంచిది కాదని ఐబి అభిప్రాయ పడ్డమే ఈ డైలమాకు కారణం. నేతాజీ విమాన ప్రమాదంలో మృతి చెందాడనే అభిప్రాయాన్ని ప్రభుత్వం తమపై బలవంతంగా రుద్దడం కోసమే చితాభస్మాన్ని తీసుకు రావాలని అనుకుంటోందని ఆయన జీవించే ఉన్నాడని గట్టిగా నమ్ముతున్న బెంగాల్ ప్రజలు భావించే ప్రమాదం ఉందని కూడా ఐబి అభిప్రాయ పడింది.