రాష్ట్రీయం

చెంచు గూడెంలో వైద్య శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 24: అడవుల్లో నివసించే చెంచుల ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ రచయితల వేదిక నడుం బిగించింది. మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ చెంచుపెంటల్లో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించి రెండు వందలమందికి పైగా ఆదివాసీలకు చికిత్స అందించింది. గతంలో తెలంగాణ రచయితల వేదిక సభ్యులు చెంచు గూడాల్లో పర్యటించినప్పుడు అనేకమంది గర్భకోశ వ్యాధులు, నేత్ర సంబంధ వ్యాధులతో బాధపడుతున్న విషయం వారికి తెలిసింది. వారితో మాట్లాడినప్పుడు కంటి చూపు మందగించినా చికిత్స లేదనే భ్రమలో ఉన్నట్టు అర్థమైంది. పోషకాహార లోపంతోపాటు ఇతర సమస్యల కారణంగా కూడా వారు అనేక వ్యాధుల బారిన పడుతున్న విషయాన్ని గమనించిన రచయితల వేదిక నేరుగా చెంచు గూడేల్లోనే వైద్య శిబిరాలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా అప్పాపూర్ చెంచుపెంటల్లో శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఆదివాసీ చెంచుల స్థితిగతులను పట్టించుకోని పాలకులు, వారిని మైదాన ప్రాంతాలకు తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రలను తెలంగాణ రచయితల వేదిక వెలికితీసి చెంచులకు అండగా నిలబడి పోరాటాలు చేయడంతో పాలకులు వెనుకడుగు వేశారని చెప్పారు. చెంచులకు అండగా నిలబడిన రచయితల వేదికను ఆయన అభినందించారు.
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ చెంచుల సంస్కృతి, సంప్రదాయాన్ని కాపాడుకోవాలన్నారు. చెంచుల జీవన స్థితిగతుల్లో వౌలికమైన మార్పులు తీసుకువచ్చేందుకే తెలంగాణ రచయితల వేదిక అన్ని వర్గాల ప్రజలతో కలిసి పని చేస్తోందని అన్నారు. వేదిక రాష్ట్ర నాయకుడు ఫ్రొఫెసర్ బెల్లి యాదయ్య, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటయ్య తదితరులు మాట్లాడారు.
వైద్య శిబిరం ముగిసిన తర్వాత చెంచు గిరిజనుల స్థితిగతులను ఎంవిఆర్ శాస్ర్తీ వారిని అడిగి తెలుసుకున్నారు. శిబిరానికి వచ్చిన చెంచులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చాన్స్‌లర్ హనుమాండ్ల భూమయ్య, సీనియర్ పాత్రికేయుడు రాజేశ్వర్‌రావు, ఫ్రొఫెసర్ మనోజ, ఎస్‌పిహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.