రాష్ట్రీయం

సినీనటి కల్పనా రంజని కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: సినీనటి కల్పనారంజని సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 51 సంవత్సరాలు. నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రలుగా నిర్మిస్తున్న ‘ఊపిరి’ చిత్రంలో నటిస్తున్న కల్పన షూటింగ్‌కోసం హైదరాబాద్ వచ్చారు. ఆమె బసచేసిన హోటల్ రూమ్‌లో తెల్లవారుజామున అపస్మారక స్థితిలో ఉండగా గమనించిన సిబ్బంది ఆమెను అపోలో ఆస్ప్రత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. అలనాటి తార కళారంజని, ఈతరం తార ఊర్వశిల సోదరి అయిన కల్పన మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. కామెడీ నటిగా, హీరోయిన్‌గా ఆమె తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. రంగస్థలనటిగా మంచి పేరున్న కల్పన మొదట బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. మలయాళ చిత్రసీమలో ఆమెకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ‘విదరున్న ముత్తకల్’ చిత్రంతో మలయాళ పరిశ్రమలోను, ఆ తరువాత భాగ్యరాజ్‌తో కలసి ‘చిన్నవీడు’ చిత్రంలో నటించి తమిళసీమలోను అరంగేట్రం చేశారు. ‘తనిచ్చల ఎంజన్’ సినిమాలో అద్భుత నటనకుగాను ఆమె ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు లభించింది. దాదాపు 300 సినిమాల్లో నటించిన ఆమె టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా, రియాల్టీ షో నిర్వాహకురాలిగా రాణించారు. ‘ప్రేమ’, ‘సతీలీలావతి’, ‘బ్రహ్మచారి’ వంటి తెలుగు సినిమాల్లో ఆమె నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలూ పొందారు. మలయాళ దర్శకుడు అనిల్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్న ఆమె కొద్దికాలం తరువాత విడాకులు తీసుకున్నారు. వారి ఏకైక కుమార్తె శ్రీమాయి ఆమెతోపాటు ఉంటున్నారు. కల్పన మృతిపట్ల ‘ఊపిరి’ చిత్ర దర్శకుడు పైడిపల్లి వంశి, ఆ చిత్రం యూనిట్ సభ్యులు, మోహన్‌లాల్, వివిధ సినీరంగానికి చెందినవారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.