ఆంధ్రప్రదేశ్‌

కెమికల్ ఫ్యాక్టరీలతో ఎప్పటికైనా ముప్పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 25: విశాఖ జిల్లాలో సోమవారం రెండు ఫ్యాక్టరీల వద్ద స్థానికులు పెద్దస్థాయిలో ఆందోళనకు దిగారు. పాయకరావుపేట మండలం రాజవరం సమీపంలోని డెక్కన్ ఫైన్ కెమికల్స్ (డిఎఫ్‌సి) పరిశ్రమ వద్ద స్థానికుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే విధంగా భీమిలి మండలంలో దివీస్ లాబోరేటరీస్ విస్తరణ యత్నాలకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. మూడో యూనిట్ కోసం కంచేరుపాలెం గ్రామాన్ని ఖాళీ చేయాలని దివీస్ యాజమన్యాం కోరుతుండగా, ఇందుకు తాము అంగీకరించబోమంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాజవరం, గజపతినగరం, కేశవరం, వెంకటనగరం గ్రామాలకు చెందిన జనమంతా ఏకమై డిఎస్‌సి గేటు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ పరిశ్రమతో ఎప్పటికైనా తమకు ముప్పు తప్పదంటూ నినాదాలు చేశారు. ఓఎస్‌డి బాబూజీ అట్టాడ ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు కంపెనీ వద్దకు చేరుకున్నారు. ఆందోళనకు దిగిన గ్రామస్థులు అటుగా వస్తున్న సిబ్బంది కారును, నర్సీపట్నం ఆర్డీఓ కె.సూర్యారావు కారును గ్రామస్థులు అడ్డగించి వెనక్కు పంపించి వేశారు. సుమారు 5గంటలపాటు తోపులాటల అనంతరం గ్రామస్థులు పరిశ్రమ గేటు వద్దకు చేరుకుని, బలవంతంగా లోపలకు ప్రవేశించారు. ఇదే సమయంలో పరిశ్రమకు వెళ్లే నీటి పైపులైనును యువకులు తగులబెట్టారు. డిఎఫ్‌ఎల్‌లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం గురించి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరా తీశారు. ప్రమాదన ఘటనపై విచారణకు జరపాల్సిందిగా జిల్లా కలెక్టర్ యువరాజ్‌ను ఆదేశించారు. విచారణ అధికారిగా జాయింట్ కలెక్టర్-2ని కలెక్టర్ నియమించారు. ఇదిలా ఉండగా విశాఖ జిల్లా భీమిలి సిటీ నగర్‌లోని దివీస్ లాబొరేటరీస్ కంపెనీ వద్ద కంచేరుపాలెం గ్రామస్థులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ కంపెనీ మూడో యూనిట్‌ను ప్రారంభించేందుకు సిద్ధపడింది. .
అలివిరలో అగ్ని ప్రమాదం
గాజవాక: విశాఖ సమీపంలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీని అనుకుని ఉన్న రాంకీ ఎస్‌ఇజెడ్‌లోని అలివిర యానిమల్ హెల్త్ లిమిటెడ్‌లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో కార్మికులకు ఎటువంటి హానీ కలుగలేదు. కంపెనీకి మాత్రం పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.