రాష్ట్రీయం

సెంచరీకి చేరువ చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభంజన మోగించడానికి ప్రధానంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం తారకమంత్రంలా పని చేసింది. తమ నేతలు ప్రచారానికి వెళ్లినప్పుడు పేద ప్రజలంతా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంపై గంపెడాశ పెట్టుకున్నట్టు తన దృష్టికి తెచ్చినట్టు ఫలితాల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలనుబట్టి గ్రేటర్‌లో టిఆర్‌ఎస్ ఘన విజయానికి ప్రధానంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పథకమని పరోక్షంగా విశే్లషించారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక దసరా పండుగ రోజున (2015) సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఐడిహెచ్ కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేసి, ఆ మరుసటి దసరా పండుగ కానుకగా వాటికి ముఖ్యమంత్రి ప్రారంభించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన నినాదంగా టిఆర్‌ఎస్ విస్తృత ప్రచారం చేసింది. ఈ ఒక్క ఏడాదిలోనే హైదరాబాద్ నగరంలో పేదల కోసం లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీని నమ్మిన పేద ప్రజలంతా ప్రభంజనంలా కదిలి గ్రేటర్ పీఠంపై టిఆర్‌ఎస్‌కు విజయకేతనాన్ని అందించారు.