తెలంగాణ

2370 మంది చిన్నారులకు అక్షర స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఫిబ్రవరి 12: ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి దేవి నిలయంలో వసంతపంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జ్ఞాన సరస్వతి దేవి జన్మదినమైన వసంతపంచమిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిలతో కలిసి మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్, ఈవో వెంకటేశ్వర్లు, ఆలయ మర్యాదలతో మంత్రులను సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాసర అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి సైతం ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ పూజారులు వసంతపంచమి ఉత్సవం సందర్భంగా ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని వినతిపత్రాన్ని మంత్రులకు అందజేశారు. ఆలయ సమీపంలో శారదదీక్ష స్వాముల సన్నిధాన భవన నిర్మాణానికి దేవాదాయశాఖ మంత్రి వ్యవసాయశాఖ మంత్రి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిలు భూమిపూజచేసి శంకుస్థాపన చేశారు. వసంత పంచమిని పురస్కరించుకుని ఒక్కరోజే 2370 మంది చిన్నారులకు అమ్మవారిచెంత అక్షర స్వీకార పూజలు నిర్వహించారు.