జాతీయ వార్తలు

కేంద్ర ప్రభుత్వంలో చేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన విజయవంతమైందని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి చెప్పారు. ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో చేరే ఉద్దేశం తెరాసకు లేదని, ఎన్‌డిఎలో చేరుతామన్నా వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. ఎన్‌డిఎకి తెరాస అంశాల వారీగా మద్దతు ఇస్తుందని, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు రాజీ లేకుండా వ్యవహారిస్తామని వేణుగోపాలచారి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా వ్యవరిస్తే కేంద్రంపై పారాటం పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెరాస భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని వేణుగోపాలచారి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన విజ్ఞప్తులకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ , పియూష్ గోయల్ సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణకు రావలసిన నిధులను కేంద్రం వచ్చే బడ్జెట్‌లో కేటాయిస్తుందని ఆయన అశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాల్సిందిగా మోదీని కెసిఆర్ కోరారని, కరీంనగర్ జిల్లా రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం శంకుస్థాపనకు మార్చి నెలలో ప్రధాని వస్తారని వేణుగోపాలచారి తెలిపారు.