రాష్ట్రీయం

సినీనటి ప్రణీతకు తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోతె, ఫిబ్రవరి 14: వర్ధమాన సినీనటి ప్రణీతకు తృటిలో ప్రాణపాయం తప్పింది. నల్లగొండ జిల్లా మోతె మండల కేంద్రం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ప్రణీత ఆ తర్వాత ఇన్నోవా వాహనంలో హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా మోతె శివారులో సూర్యాపేట-ఖమ్మం రహదారిపై మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారున్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన పడిపోయింది. ప్రమాదస్థలికి సమీపంలో రోడ్డు పనులు జరుగుతుండగా గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని వాహనం అద్దాలను పగులగొట్టి చేసి ప్రణీతతో పాటు వాహనంలో ఉన్నవారిని బయటకుతీసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ప్రణీతకు స్వల్ప గాయాలు కాగా, కారులో ఉన్న మేకప్‌మన్ రమేష్‌బాబు, హెయర్ స్టయిలిస్ట్ సౌభాగ్యలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయ. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రణీత మేనేజర్ మహేశ్‌తో పాటు మరోవ్యక్తి ఉన్నప్పటికీ వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం కారణంగా తీవ్ర షాక్‌కు గురైన ప్రణీతకు 108 వాహనంలో ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత ఆమె మరో వాహనంలో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ప్రమాద సమయంలో ప్రణీత సీటుబెల్ట్ ధరించి ఉండడం వల్లే సురక్షితంగా బయటపడ్డారు. మేకప్‌మన్ రమేష్‌బాబు ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు మోతె ఎఎస్‌ఐ గఫూర్ తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. సినీనటి కారు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకుని స్థానికులు పెద్దసంఖ్యలో ప్రమాదస్థలికి తరలివచ్చారు.