రాష్ట్రీయం

‘కాల్’కేయుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాద్ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఇంటర్నేషనల్ వాయిస్ కాల్ రాకెట్‌ను సిసిఎస్ పోలీసులు రట్టు చేశారు. వాయిస్ కాల్ రాకెట్‌కు హబ్‌గా మారిన హైదరాబాద్‌లో ఇటీవల ఇద్దరు యువకులను అరెస్టు చేసి విచారించగా గుట్టు రట్టయింది. లోకల్ కాల్ ఛార్జీలతో ఇంటర్నేషనల్ వాయిస్ కాల్ నడుస్తున్నందున ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు గండి పడుతోంది. టాక్ ఫ్రీ..ఫ్రీ కాల్స్ పేరుతో మోసానికి పాల్పడుతున్నారు. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ఫోన్ (విఓఐపి) ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా ఇటీవల జరిపిన దాడిలో నగరానికి చెందిన ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. వీరిలో రాజేంద్రనగర్‌కు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ (23), మహమ్మద్ అహెత్రమ్ (28) ఉన్నారు. అహెత్రమ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి, సిస్కో-క్రెడిటెడ్ నెట్‌వర్కు అసోసియేట్ (సిసిఎన్‌ఏ) కోర్సు చేశాడు. అతి తక్కువ సమయంలో పెద్దమొత్తం సంపాదించాలన్న ఉద్దేశంతో రాజేంద్రనగర్‌లో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ఫోన్ (విఓఐపి)తో వీరిద్దరు కలసి ‘ఇంటర్నేషనల్ కాల్ ఫెసిలిటీ’ అంటూ అక్రమంగా ఓ నెట్ కేఫ్‌ను ప్రారంభించారు. నెట్ కేఫ్ ప్రారంభానికి ముందు అహెత్రమ్ దుబాయ్ వెళ్లి అక్కడి ఆపరేటింగ్ గ్యాంగ్ వద్ద శిక్షణ పొందినట్టు సిసిఎస్ జాయింట్ కమిషనర్ టి ప్రభాకర్‌రావు తెలిపారు. వినియోగదారుల అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా నమోదు చేసుకుంటూ సుమారు ఐదు వందల సెట్‌టాప్స్‌ను ఏర్పాటు చేసుకొని నెలకు రెండు లక్షల రూపాయలు అక్రమార్జనకు పాల్పడ్డారు. దుబాయ్, ఖతర్, కువైట్, అమెరికా, సింగపూర్ కాల్స్‌ను ట్రాప్ చేసి వీరు ప్రత్యేకంగా రూపొందించుకున్న సెట్‌టాప్స్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా కాల్స్‌ను మళ్లించే వారు. అదేవిధంగా కాల్ ఫ్రీ..టాక్ ఫ్రీ..అంటూ కొన్ని కార్డ్స్‌ను రూపొందించి చవక ధరకు విక్రయించేవారు. తక్కువ ధరకు కొన్న కార్డులతో అంతర్జాతీయ కాల్స్‌ను ఎలా చేస్తారని అనుమానంతో కొందరు చేసిన ఫిర్యాదు మేరకు నగర సిసిఎస్ పోలీసులు, టాస్క్ఫోర్సు పోలీసులు రంగంలోకి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ఫోన్ కాల్ రాకెట్‌ను ఛేదించారు. లోకల్ సర్వీసు ప్రొవైడర్ల సహకారంతో ఈ రాకెట్ కొనసాగుతోందని పోలీసులు కనుగొన్నారు.