జాతీయ వార్తలు

చర్చలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరాపుట్, ఫిబ్రవరి 19:బేషరతుగా హింసాకాండను విడనాడే పక్షంలో మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారంనాడిక్కడ స్పష్టం చేశారు.హింసాత్మక కార్యకలాపాలకు స్వస్తి పలికి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. ఇందుకు నక్సల్స్ బేషరతుగా సిద్ధమైతే వారి డిమాండ్లపై చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తుందని మీడియా సమావేశంలో తెలిపారు.ఒడిశాలో వామపక్ష ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న కోరాపుట్ జిల్లాలో చేపడుతున్న చర్యలను సమీక్షించిన అనంతరం రాజ్‌నాథ్ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో హింసా ధోరణులకు తావులేదని, ఆయుధాలు వీడి మావోలు శాంతిపథంలో అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టిందని చెప్పిన రాజ్‌నాధ్ ‘ఆయుధాలు వీడి ఈ పథకాల ప్రయోజనాలను పొందండి’అని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లలో మావోయిస్టులపై పోలీసు చర్యను గట్టిగా సమర్థించారు. చాలా సందర్భాల్లో ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు కాల్పులు జరపాల్సి వస్తుందని, అలాంటి సంఘటనల్లో నక్సల్స్ మరణించడం జరుగుతుందని అన్నారు. మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారంటూ ఒడిశా ప్రభుత్వాన్ని, అధికారులను అభినందించారు. రాష్ట్ర పోలీసులు, బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, జిల్లా అధికారులతో మావోయిస్టు నిరోధక ఆపరేషన్లపై దాదాపు రెండు గంటల పాటు హోం మంత్రి సమీక్షా సమావేశం జరిపారు.