బిజినెస్

చివర్లో కొనుగోళ్ల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 19: లావాదేవీల చివర్లో పెద్ద ఎత్తున కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం ప్రారంభంలో నష్టాలనుంచి బైటపడి సెనె్సక్స్ 60 పాయింట్ల స్వల్ప లాభంతో మగిసేందుకు దోహదపడ్డాయి. బ్యాంకింగ్, బ్లూచిప్ కంపెనీల షేర్లు చక్కటి లాభాలు ఆర్జించడంతో అక్టోబర్ తర్వాత మార్కెట్లు తొలిసారిగా వారంలో మంచి లాభాలు ఆర్జించేలా చేశాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో ఐరోపా మార్కెట్లు లాభాల్లో సాగడం కూడా మార్కెట్లు కోలుకోవడానికి దోహదపడ్డాయి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం తిరిగి 7,200 పాయింట్ల స్థాయికి చేరుకుంది. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం సంస్కరణలను ప్రకటించవచ్చన్న అంచనాలతో ఇనె్వస్టర్లు తమ పొజిషన్లను బలోపేతం చేసుకుంటున్నట్లు కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో అక్టోబర్ తర్వాత రెండు ప్రధాన సూచీలు కూడా వారంలో అత్యుత్తమ లాభాలతో ముగిసాయి. సెనె్సక్స్ 723 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 229.80 పాయింట్లు లాభపడింది. అయితే ఇనె్వస్టర్లు లాభార్జనకే మొగ్గు చూపడంతో పైస్థాయిలో మార్కెట్లు నిలబడలేక పోయాయి. గత రెండు సెషన్స్‌లో సెనె్సక్స్ 457.25 పాయింట్లు లాభపడింది. శుక్రవారం ఉదయం 23,640.32 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత అవసరాలకు మించి సరఫరాలతో ముడిచమురు ధరల్లో తిరిగి బలహీనత చోటు చేసుకోవడం కారణంగా మరింత దిగజారింది. అయితే, ఆ తర్వాత స్పెక్యులేటర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడంతో సెనె్సక్స్ అద్భుతంగా పుంజుకుని చివరికి దాదాపు 60 పాయింట్ల లాభంతో 23,709.15 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 19 పాయింట్లు లబ్ధి పొంది 7,210.75 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్‌లోని మొత్తం 30 స్టాక్స్‌లో 18 లాభాల్లో ముగిశాయి. ఎస్‌బిఐ తన వ్యాపారాభివృద్ధి కోసం బాండ్ల ద్వారా 3 వేల కోట్ల రూపాయలు సముపార్జించుకోవడంతో దాని షేరు అత్యధికంగా 3.20 శాతం లాభపడింది. హీరో మోటో కార్ప్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఎన్‌టిపిసి, భారతీ ఎయిర్‌టెల్ ఎంఅండ్‌ఎం కూడా మంచి లాభాలు ఆర్జించాయి. నష్టపోయిన వాటిలో మారుతి సుజుకి, బిహెచ్‌ఇఎల్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్, సిప్లా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందుస్థాన్ యూనీ లీవర్ 2 శాతం పైగా పడిపోవడం సూచీల పెరుగుదలకు అడ్డుగా మారింది. కాగా, ఐరోపా మార్కెట్లు ప్రారంభంలోనే లాభాల్లో సాగగా, ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది.
ఇదిలా ఉండగా, లిస్టింగ్, కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలకు సంబంధించి నిబంధనలను పాటించనందుకు ప్రధాన స్టాక్ ఎక్స్‌చేంజి అయిన బిఎస్‌ఇ 19 సంస్థలను పరిమిత ట్రేడింగ్ కేటగిరీ (జడ్)లోకి మార్చనుంది. ఈ నెల 26నుంచి 19 కంపెనీల షేర్లను జడ్ కేటగిరీలోకి మార్చనున్నట్లు బిఎస్‌ఇ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ 19 కంపెనీల్లో విశ్వామిత్ర ఫైనాన్షియల్ సర్వీసెస్, మురళి ఇండస్ట్రీస్, అవివా ఇండస్ట్రీస్, ఐఎఫ్‌ఎల్ ప్రమోటర్స్, సాగర్ టూరిస్ట్ రిసార్ట్స్, ఇండో-ఏసియన్ ప్రాజెక్ట్స్, ఆడోర్ మల్టీ ప్రాడక్ట్స్, జయవంత్ ప్రాడక్ట్స్‌లాంటివి ఉన్నాయి. వరసగా రెండు త్రైమాసికాలు నిబంధనలు పాటించనందున ఈ కంపెనీల షేర్లను 26నుంచి జడ్ కేటగిరీకి మారుస్తున్నట్లు బిఎస్‌ఇ ఆ ప్రకటనలో తెలిపింది.