రాష్ట్రీయం

18వ శతాబ్దం నాటి నంది విగ్రహం చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హన్వాడ, ఫిబ్రవరి 26: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం గొండ్యాల గ్రామంలోని శివాలయంలో 18వ శతాబ్ధం నాటి పురాతన నంది విగ్రహం చోరీకి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున భక్తులు దేవాలయానికి వెళ్లి స్వామివారికి దర్శించుకునేందుకు గుడి తలుపులు తెరిచి చూడగా గుడిలోని నంది విగ్రహం లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు దేవాలయం దగ్గరకు వచ్చి పరిశీలించి అర్థరాత్రి సమయంలో దుండగులు నంది విగ్రహాన్ని చోరి చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని హన్వాడ పోలీసులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దాంతో హన్వాడ ఎస్సై లక్ష్మయ్య గొండ్యాల గ్రామానికి చేరుకుని నందిశ్వరుడు గల శివాలయాన్ని పరిశీలించారు. కాగా దేవాలయంలోని నంది విగ్రహాన్ని దొంగిలించుకుపోయిన దుండగులను పట్టుకోవాలంటూ భక్తులు హన్వాడ, వేపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఈ విషయంపై స్పందించిన ఎస్సై రాస్తారోకోను విరమించాలని గ్రామస్థులను కోరారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు రాస్తారోకోను విరమించారు. ఈ మేరకు గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.