హీరోగా అజారుద్దీన్ తనయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు అబ్బాస్ తెలుగు తెరపై హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. శ్రీ శివపార్వతి కంబైన్స్ పతాకంపై నిర్మాత కె.సురేష్‌బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రం ‘ఇద్దరికీ కొత్తేగా’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ, అబ్బాస్ సరసన ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని, త్వరలో ఈ సినిమాను ప్రారంభించనున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.