కరీంనగర్

కూలీ పెంచాలి.. భూమి పంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 22: ఎన్నికలకు ముందు కార్మిక,కర్షకులు, బడుగు,బలహీన వర్గాలకు ఇచ్చిన హామీల్లో భాగంగా కూలీ రేట్లు పెంచి, దళితులకు భూములు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యోడు విజయరాఘవన్ డిమాండ్ చేశారు. ఆసంఘం రాష్టమ్రహాసభల్లో భాగంగా శుక్రవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. ప్రజాసంక్షేమం వీడిన పాలకులు కార్మికుల హక్కులను భూస్వామ్య, పెట్టుబడిదారులకు తాకట్టుపెట్టి తమజేబులు నింపుకుంటున్నారని, వీటిని రక్షించుకునేందుకు ఐక్యపోరాటాలకు సిద్దంకావాలని పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూండగా, దీనిని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెతో కేంద్రం దిగివచ్చినా, భవిష్యత్‌లో దొంగదెబ్బ తీసేందుకు వేచిచూస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, హక్కులను గుండెల్లో దాచుకునేందుకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. నిత్యం కాయకష్టంతో దేశ ఆర్దిక రంగానికి ఊతమిస్తున్న శ్రమజీవులకు ఉద్యమాలతోనే మనుగడ ఉంటుందన్నారు. ఎన్నికల్లో పేదలే దేవుళ్ళు, వారి అభివృద్దికే తాము పెద్దపీట వేస్తామని పదేపదే చెప్పి, పెద్దొళ్ళకు మాత్రమే సంక్షేమఫలాలు అందేలా చొరవచూపుతున్నారని దుమ్మెత్తిపోశారు. దీంతో ముఖ్యమంత్రిపై పెట్టుకున్న ఆశలు అడియాశలే అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం అధికారంకోసమే అన్నట్లు రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగిస్తున్నారని, ఇప్పటికే ఆ ఇంట్లో ముగ్గురు పాలిస్తుండగా, తాజాగా నాలుగోపదవి కోసం కేంద్రం ముందు మోకరిల్లేందుకు ముఖ్యమంత్రి వెనుకాడటంలేదని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పథకం ఊళ్ళలోని దొరలకు కంటగింపుగా మారిందని, ఈపథకంద్వారా కూలీలు రెండు పూటలా కడుపునిండా భోజనం చేస్తుండటాన్ని కూడా భూస్వాములు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కరువు కరాళ నృత్యం చేస్తుంటే, అభివృద్ది పేర ప్రభుత్వం నిధులు దుబారా చేస్తుందని విమర్శించారు. జిల్లాను కరువుప్రాంతంగా ప్రకటించాలని, ఉపాధి కూలీ రోజుకు రూ.300 పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం భరతం పట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈసభలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, నాయకులు ఎస్.వీరయ్య, మల్లు స్వరాజ్యం, గీట్ల ముకుందరెడ్డి, వర్ణవెంకట్‌రెడ్డి, మిల్కూరి వాసుదేవరెడ్డి, సి ఐటియు ఎడ్ల రమేశ్, పప్పు సదానందం, సుంకరి సంపత్, ఎస్ ఎఫ్ ఐ శేఖర్, తిరుపతినాయక్, అంగన్‌వాడీ జ్యోతి, ఎరవెల్లి ముత్యంరావుతో పాటు జిల్లా నలుమూలలనుంచి వచ్చిన వ్యవసాయ కార్మికులు, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.