ప్రత్యేక పాటకు సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్షీచౌదరి అంటేనే ఓ అందమైన అమ్మాయి గుర్తుకొస్తుంది. గతంలో అనేక చిత్రాల్లో కథానాయికగా నటించిన ఈ అమ్మడికి ఇప్పుడు అవకాశాలు తక్కువయ్యాయి. అందానికి అందం, నటనకు నటన వున్న సాక్షికి కూసింత అదృష్టం లేకపోవడంతో సరైన సినిమాలు పడలేదు. ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అనదగిన సినిమా ఒక్కటీ లేకపోవడంతో ఐటెం పాటలకు కూడా సై అంటోంది. తాజాగా గోపీచంద్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘ఆక్సిజన్’ చిత్రంలో ఆమె ఓ పాటను స్పెషల్‌గా చేసింది. ‘జేమ్స్‌బాండ్’, ‘పోటుగాడు’, ‘సెల్ఫీరాజా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాక్షీ చౌదరి చేసిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుందని యూనిట్ నమ్ముతోంది. ‘అరె.. అదిరిందే.. నువ్వు కాలర్ గాలిలో ఎగరేసి వస్తుంటే..’ అన్నపాటను ఆమెపై చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో సాక్షీచౌదరితోపాటుగా హీరోయిన్ రాశీఖన్నా, హాస్యనటుడు అలీ కూడా నృత్యం చేయడం ఈ పాటలో విశేషం. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ‘ఆక్సిజన్’లో సాక్షీచౌదరి ఎన్ని మెరుపులు మెరిపించిందో సినిమా చూస్తేనే తెలుస్తుంది.

చిత్రం..సాక్షీచౌదరి