ఊరూరా పతాకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ నటిస్తున్న నూరవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల ఆనందాన్ని ద్విగుణీకృతం చేయడానికి నిర్మాతలు సన్నాహాలు ప్రారంభించారు. అలనాడు శాతకర్ణి విజయపరంపరకు గుర్తుగా ఒకే రోజు ఒకే సమయంలో దేశంలోని కోటలన్నిటిపై ఆయన పతాకాన్ని ఎగురవేసిన సంగతి తెలిసిందేనని ఆ రోజే మనకు ఉగాది అయిందని తెలిపారు. శకారంభంలో మొదలైన ఆ పండుగ యుగాంతం వరకు జరుగుతుందని, ప్రతి భారతీయుడి గుండెల్లోని దమ్మును ప్రపంచానికి చాటేందుకు నాడు జరిగిన పతాక ఉత్సవాన్ని సినిమా విడుదల సందర్భంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. శాతకర్ణి సినిమా ప్రదర్శిస్తున్న ప్రతి థియేటర్ కూడా శాతవాహన కోటగా మారనుందని, ఎనిమిదో తేదీన తెలుగు రాష్ట్రాలలో వంద థియేటర్లకు ఒక్కసారిగా శాతవాహన పతాకం ఎగురబోతోందని వారు తెలిపారు. ఆరోజు సాయంత్రం 5.40 నిముషాలకు పతాక ఉత్సవాన్ని విశాఖపట్నంలోని జ్యోతి థియేటర్‌లో మొదలు పెడతామని, అదే సమయంలో బాలకృష్ణ అభిమానులు పలు థియేటర్లలో ఈ పతాకోత్సవాన్ని నిర్వహిస్తారని అన్నారు. క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం, శాతకర్ణిగా బాలకృష్ణ నటన ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. హేమమాలిని, శ్రీయా శరణ్, కబీర్‌బేడీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: చిరంతన్‌భట్, పాటలు: సిరివెనె్నల, మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.