రెండు భాషల్లో పిజ్జా2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో విజయ్ సేతుపతి తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్. ఈ చిత్రాన్ని పిజ్జా-2 పేరుతో ఆర్‌పిఏ క్రియేషన్స్‌తో డీవి సినీ క్రియేషన్స్ సంస్థ కలిసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ,‘టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించాం. వరుసగా ఏడు హిట్లతో తమిళ సినీ రంగంలో ముందంజలో దూసుకుపోతున్న విజయ్ సేతుపతికి ఎనిమిదవ హిట్‌గా నిలుస్తుంది. తెలుగులో ప్రేమకథా చిత్రమ్, జక్కన్న చిత్రాలు నిర్మించిన ఆర్‌పిఏ క్రియేషన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఆద్యంతం ఉత్కంఠను కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు’ అని తెలిపారు.