పల్లెటూరి కాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ దర్శకుడు బాల నేతృత్వంలో శర్కునం దర్శకత్వంలో బి స్టుడియోస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘చండివీరన్’. ఈ చిత్రాన్ని లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్, శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగులో ఎమ్‌ఎమ్‌ఆర్ అందిస్తున్నారు. అధర్వ, ఆనంది, లాల్ ప్రధాన తారగణంగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో బుధవారం ఉదయం దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హృదయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మురళి తనయుడు అధర్వ ఈ చిత్రంలో హీరోగా అందరికీ నచ్చేలా నటించారని, తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందని తెలిపారు. బాల సమర్పణలో కాళీ పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నామని, పల్లెటూరి వాతావరణంలో రూపొందిన ఈ చిత్రంలో నీటికోసం రెండు ఊళ్ల మధ్య జరిగిన పోరాటం ప్రధానంగా వుంటుందని, సంక్రాంతి సంబరాలు, పల్లెటూరి సరసాలు, సరదాలు అన్నీ వున్నాయని, తొలి సగం కడుపుబ్బ నవ్విస్తుందని నిర్మాత ఎమ్ ఎమ్‌ఆర్ తెలిపారు. రెండవ సగం ఉత్కంఠ భరితంగా ఉంటుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసామని, ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆన అన్నారు. కార్యక్రమంలో చల్లా భాగ్యలక్ష్మి తదితదులు చిత్ర విశేషాలు తెలిపారు. రాజశ్రీ, బోస్ వెంకట్, శాంత కుమారి, రవిచంద్రన్, అనంతన్, కలై, మధురై రమేశ్, జికె తదితరులు నటించారు.