ప్రేమలో కొత్త ఫీల్ -దర్శకురాలు బి.జయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయిత్రిగా, డైరెక్టర్‌గా ఓ ఇమేజ్ తెచ్చుకున్న జయ.బి. గతంలో చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి హిట్ చిత్రాలను అందించి ప్రస్తుతం ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇపుడు పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలు..

గ్యాప్ తర్వాత..
‘లవ్‌లీ’ తర్వాత మా బ్యానర్‌పై రూపొందించిన ‘వైశాఖం’. చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. కథ విషయంలో రాజీ పడకూడదన్నదే ఈ గ్యాప్‌కు కారణం. ఏడాది విరామం తర్వాత ఇపుడు తీస్తున్న సినిమాలో నటీనటులు, టెక్నీషియన్లు అందరూ ఇష్టపడి చేశారు. సినిమా బాగా వచ్చిందని యూనిట్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కొత్తవాళ్ళతో సినిమా చేసి అనుకున్న అవుట్‌పుట్ రాబట్టుకోవడానికి సమయం పడుతుంది.
కొత్తవాళ్ళయినా..
కథ విషయానికి వస్తే హీరో ఉండే అపార్ట్‌మెంట్‌లోకి హీరోయిన్ ఓ ఉద్దేశంతో వస్తుంది. హీరోను ఎలా మార్చిందనేదే కథ. హీరో హరీష్, హీరోయిన్ అవంతిక పాత్రలకు బాగా నప్పారు. పాటలు విజువల్‌గా బావుండాలని ముందుగానే అనుకున్నాను. లవ్‌లీ సినిమా సాంగ్స్‌ను టర్కీలో షూట్ చేశాం. ఈసారి ఏదైనా కొత్త లొకేషన్ ఉండాలని భావించి కజకిస్తాన్‌లో మూడు సాంగ్స్‌ను షూట్ చేశాం. అపార్ట్‌మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా కాబట్టి ఎక్కువమంది ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.
అన్ని అంశాలున్నాయి..
రమాప్రభ, సాయికుమార్ క్యారెక్టర్స్ అందరికీ నచ్చుతాయి. పృధ్వీ క్యారెక్టర్ కామెడీగా సాగుతుంది. డి.జె.వసంత్ ట్యూన్స్ అందరికీ నచ్చుతాయి. వెంకట సుబ్బారావు సినిమాటోగ్రఫి కూడా ప్లస్ అవుతుంది. నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా కథను తయారుచేసుకున్నా.
రిఫరెన్స్‌గా ఉంటుంది..
మా బ్యానర్‌లో వచ్చిన చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ సినిమాలు బయ్యర్స్‌కు లాభాలు తెచ్చిపెట్టడంతో బిజినెస్ పరంగా మంచి క్రేజ్ నెలకొంది. వైశాఖం డెఫనెట్‌గా హిట్ కావడమే కాదు, తర్వాత వచ్చే ఈ తరహా సినిమాలకు రిఫరెన్స్ మూవీ అవుతుంది. వచ్చే నెల ఆడియో విడుదల చేసి వేసవిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.

- త్రి