ఎలిమెంట్స్‌తో క్యూట్ లవ్‌స్టోరీ ... -ఇషాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రోగ్ చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో హీరోగా పరిచయం అవుతున్న ఇషాన్ చిత్ర విశేషాలను తెలిపారు. ఉగాది కానుకగా ఈ నెల 31న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సినిమా విశేషాలు...
రెండు భాషల్లో హీరోగా
ఒకేసారి తొలి చిత్రంతో రెండు భాషల్లో హీరోగా పరిచయం అవుతుండడం ఉద్వేగంగా ఉంది. ఈ సినిమాతో నా కెరీర్ మొదలవుతోంది. నా డ్రీమ్ నిజం కాబోతున్నందుకు ఆనందంగా వుంది.
హీరోగా మొదటి నుంచి..
హీరోగా నటించాలని మొదటి నుంచీ అనుకున్నాను. ఈ విషయాన్ని మా అన్నయ్యకు చెప్పాను. హీరోగా నటించడానికి క్వాలిఫికేషన్ ఒక్కటే సరిపోవని, యాక్టింగ్, డాన్స్, ఫైట్స్.. ఇలా అన్నీ నేర్చుకోవాలని ఆయన చెప్పారు. బాగా కష్టపడే తత్వం నేర్పారు. దాదాపు సంవత్సరంన్నరపాటు సినిమాలకు ప్రొడక్షన్ విభాగంలో పనిచేశాను. అలా నా ప్రయాణం మొదలైంది. మాస్టర్ సత్యానంద్ బాగా శిక్షణ ఇచ్చారు.
పెద్ద ఫాన్‌ని
దర్శకుడు పూరి జగన్నాథ్‌కు నేను పెద్ద ఫాన్‌ని. ఆయన దర్శకత్వంలో నటించబోతున్నానని తెలియగానే సంబరపడ్డాను. అది నాకు ఓ రకంగా షాకింగ్ న్యూసే. ఇడియెట్, పోకిరి, లోఫర్ లాంటి చిత్రాల్లో హీరో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తాడు. అలాగే ఈ చిత్రంలో కూడా హీరో రోగ్‌లాగా కనిపిస్తాడు. కచ్చితంగా నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుంది. నా పాత్ర ఎంత బాగా వుంటుందో, విలన్ పాత్ర కూడా అంతే వైవిధ్యంగా వుంటుంది.
క్యూట్ లవ్‌స్టోరిగా
ఇదొక వైవిధ్యమైన చిత్రం. డిఫరెంట్‌గా సాగుతూనే ఫ్యామిలీ సెంటిమెంట్‌తో సాగే క్యూట్ లవ్‌స్టోరీగా దర్శకులు తీర్చిదిద్దారు. కంప్లీట్ పాకేజీ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పచ్చు.
సంగీతం హైలెట్
సునీల్ కశ్యప్ మంచి పాటలను అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియో సూపర్‌హిట్ అయింది. విజువల్‌గా కూడా పాటలన్నీ క్యూట్‌గా వుంటాయి. ప్రతి పాట డిఫరెంట్‌గా వుంటుంది. కెమెరామెన్ విజువల్‌గా ఈ సినిమాను ఓ దృశ్యకావ్యంలా తీర్చిదిద్దారు.

-యు