మంచి మాట

చిత్ర విచిత్ర గారడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క భారతదేశంలో మాత్రమే వినోద కార్యకలాపాల్లో చోటుచేసుకున్నది ఈ ‘ది గ్రేట్ ఇండియన్ రోప్ ట్రిక్!’ ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయిన ఈ విద్య 19వ శతాబ్దానికి ముందుది అని కొందరు, తొమ్మిదో శతాబ్దం నుంచే ప్రజలను అలరారుస్తోందని వివరించే కథనాలు కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు... ఆది శంకరాచార్యుల వారు రచించిన మాండుక్యోపనిషత్‌లో ఈ తాడు గారడీ (రోప్ ట్రిక్) ప్రస్తావన ఉంది. ఈ గారడీ చేసే విధానాలకు సంబంధించి పలురకాల కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ పైన పేర్కొన్న కథనం అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. 1890లో జాన్ విలీ అనే ఆయన రచించిన ఈ కథనం ప్రముఖ దినపత్రిక ‘షికాగో ట్రిబ్యూన్’లో ప్రచురితమైంది.
మరి ఈ గారడీ ఉదంతమంతా నిజమేనా? కచ్చితంగా అందరూ చూస్తుండగా జరిగిందేనా? దీన్ని అందరూ నమ్మవచ్చా? ఆ మోకుతాడు దానంతట అదే గాల్లో నిలబడిందా? లాంటి తలెత్తిన అనేక సందేహాలకు కొన్ని వివరణలు కూడా లేకపోలేదు.

-గున్న కృష్ణమూర్తి