బిజినెస్

ప్రభుత్వ ఆదాయానికి టెలికామ్ సంస్థల గండి: కాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: దేశీయంగా ఆరు టెలికామ్ సంస్థలు ఆదాయాన్ని తక్కువ చూపడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 12,488 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తెలిపింది. శుక్రవారం పార్లమెంట్‌కు వచ్చిన కాగ్ నివేదికలో 2006 నుంచి 2010 వరకు రిలయన్స్ కమ్యూనికేషన్స్, వొడాఫోన్, ఎయిర్‌టెల్, టాటా టెలికామ్, ఐడియా, ఎయిర్‌సెల్ సంస్థలు తమ స్థూల ఆదాయాన్ని 46,045.75 కోట్ల రూపాయ లు తక్కువ చేసి చూపించాయని, ఫలితంగా ఈ ఐదేళ్లలో ప్రభుత్వం 12,488.93 కోట్ల రూపాయల ఆదా యం కోల్పోయిందని కాగ్ తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి 3,728.54 కోట్ల రూపాయలు, టాటా టెలీసర్వీసెస్ నుంచి 3,215.39 కోట్ల రూపాయలు, ఎయిర్‌టెల్ నుంచి 2,651.89 కోట్ల రూపాయలు, వొడాఫోన్ నుంచి 1,665.39 కోట్ల రూపాయలు, ఐడియా నుంచి 964.89 కోట్ల రూపాయలు, ఎయిర్‌సెల్ నుంచి 26 2.83 కోట్ల రూపాయల మేర ప్రభు త్వం ఆదాయాన్ని నష్టపోయిందని కాగ్ తెలిపింది. మరోవైపు 2012-13 లో సర్దుబాట్లతో టెలికామ్ సంస్థలు వన్‌టైమ్ ఎంట్రీ ఫీజుగా స్పెక్ట్రమ్‌కు చేసిన చెల్లింపుల్లోనూ ప్రభుత్వం 5,476.3 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయిందని కాగ్ వెల్లడించింది. ఈ సంస్థల లైసెన్సులను సుప్రీం కోర్టు రద్దు చేయగా, 2012 నవంబర్, 2013 మార్చిలో నిర్వహించిన 1800, 800 మెగాహెట్జ్‌లో స్పెక్ట్ర మ్‌కు విధించిన నాన్-రిఫండబుల్ ఎంట్రీ ఫీజులో టెల్కోలు నిబంధనల కు విరుద్ధంగా వ్యవహరించాయంది.