సంజీవని

కాల్షియం లోపం ఎముకలకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు ఎముక బలంగా వుండడానికి కారణాలు. వయసు పెరిగేకొద్దీ కావాల్సిన కాల్షియం లభించకపోవడంతో ఎముకలు పెళుసు అవుతాయి. తేలికగా విరిగిపోతాయి. ఈ స్థితినే ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు. పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, పాలకూర లాంటి వాటితో కాల్షియం పొందవచ్చు. కాల్షియంను సప్లిమెంట్‌గా టాబ్లెట్స్‌లోనూ తీసుకోవాలి అవసరాన్ని బట్టి. శరీరం కాల్షియంను పీల్చుకోవడానికి విటమిన్ డి అవసరం. సూర్యరశ్మి శరీరాన్ని తాకడంవల్ల, ఆహారంవల్ల విటమిన్ డి సాధారణంగా లభిస్తుంటుంది. ఆస్టియోపోరోసిస్ రాకుండా వుండాలంటే వ్యాయామం అవసరం. ముఖ్యంగా నడక. ఆడవాళ్లకీ నడక అవసరం. నడకవల్ల ఎముకలకు రక్తంలోని కాల్షియంని పీల్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. పొగ తాగడం, మద్యం సేవించడం మానుకోవాలి. పొగ తాగే మహిళల్లో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. అంతేకాకుండా కాల్షియంని తక్కువగా పీల్చుకుంటారు. వ్యాయామం ద్వారా ఎప్పుడూ చురుగ్గా వుండి శరీరాన్ని నిర్ణీత స్థితిలో వుంచుకున్నట్లయితే ఆస్టియోపోరోసిస్‌కు దూరంగా వుండవచ్చు.

- డా. సాయి లక్ష్మణ్