చిత్తూరు

కాల్‌మనీ వ్యవహారంతో వణుకుతున్న వడ్డీ వ్యాపారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 22: పేదల అవసరాల క్రమంలో వడ్డీ వ్యాపారులకు కనక వర్షం కురిపించిన బాండు పత్రాలు, ఖాళీ చెక్కులు నేడు విషం చిమ్మే సర్పాలుగా దర్శనమిస్తున్నాయి. విషసర్పం ఇంట్లో ఉంటే ఎలా కంటికి నిద్ర ఉండదో నేడు బాండు పత్రాల బస్తాలు ఇంట్లో ఉంటే వడ్డీ వ్యాపారులకు కునుకు పట్టడం లేదు. చివరకు ఏ రుణ గ్రస్తుడు ఎక్కడా తమ పేరు చెబుతాడనే వడ్డీ వ్యాపారులు వణుకుతున్నారు. అయితే కాల్ మనీపై వస్తున్న ఆరోపణలు ఏది నిజమో ఏది అబద్దమో పోలీసులు కూడా తలలు పట్టుకొంటున్నారు. ఒక్క తిరుమల తిరుపతి ప్రాంతంలో 200 వందల కోట్లకు పైగా ధనం వడ్డీ రూపంలో చేతుల మారుతుందన్న అంచనా. జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే 1000 కోట్ల ఉంటుందన్న కూడా అంచనాలు లేకపోలేదు. ఈ కాల్ మనీ వ్యవహారంలో ఆదాయం పన్ను శాఖాధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. వడ్డీలకు మార్చే వారి జాబితాను సేకరించే పనిలో బిజిగా ఉన్నారు. ఇదిలావుండగా కాల్‌మనీ వ్యవహారంలో పేదలను మోసం చేసే వారిని వదిలి పెట్టబోమని బాధితులు అధిక వడ్డీలతో తీసుకున్న డబ్బులు చెల్లించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించడంతో వడ్డీ వ్యాపారుల గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా వడ్డీ వ్యాపారం చేస్తూ రుణగ్రస్తుల నుండిఅధికమొత్తంలో వడ్డీలు తీసుకోవడమేకాకుండా వారి నుండి బాండ్లు, భూ పత్రాలు, ఖాళీ చెక్కులు మూటల కొద్దీ ఇంట్లో దాచుకొన్న వారు వణుకుతున్నారు. మొన్నటి వరకు వడ్డీ వ్యాపారులకు తమ వద్ద మూటల్లో ఉన్న బాండ్లు, పత్రాలు, చెక్కులు లక్ష్మీకటాక్షంగా కనిపిస్తే నేడు జైలు ఊచలను గుర్తు చేస్తున్నాయి. ఇచ్చిన డబ్బులు వస్తాయో రావో దేవుడికి ఎరుకని ముందు చట్టానికి చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో తెలియక కంటి మీద కునుకులేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు బాండ్ల మూటలు తలగడగా చేరి సుఖనిద్రను ఇస్తే నేడు అవి ధనసర్పాలుగా ఎక్కడ కాటేస్తాయని కంటిమీద కునుకు లేని రాత్రులను గడుపుతున్నారంటే అతిశయోక్తి లేదు. తమ వద్ద ఉన్న పత్ర సర్పాలను ఎవరికి చూపించనూ లేరు పట్టించనూ లేరు దీంతో మూడో కంటికి తెలియకుండా వాటిని ధ్వంసం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే రేణిగుంట మండలంలోనే దాదాపు రెండు మూటలున్న బాండ్లు, పత్రాలు, చెక్కులను మారుమూలకు తరలించి తగలపెట్టడమే ఇందుకు నిదర్శనం. ఈ పత్రాల్లో తిరుమల, తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో నివసిస్తున్న రుణ గ్రస్తుల చిరునామాలున్నాయి. ఒక రేణిగుంట మండలంలో ఒకరి వద్ద ఇన్ని బస్తాలు బాండ్లు, పత్రాలున్నాయంటే జిల్లా వ్యాప్తంగా ఎంతమంది వడ్డీ వ్యాపారులు న్నారో, వారి వద్ద ఎన్ని బోగీల బాండ్లకు దుమ్ము పడుతున్నాయో అర్ధం కాని పరిస్థితిగా తయారయ్యింది. ఇదిలావుండగా కాల్‌మనీ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం గట్టిచర్యలు చేపట్టడంతో రేణిగుంట పట్టణంలో స్థానిక రాజరాజేశ్వరి కాలనీ సమీపంలో కల్వర్టు కింద గుట్టలకొద్దీ మార్టుగేజు, ఖాళీ చెక్కులు, దస్తావేజులు, 100 రూపాయల ఖాళీ బాండ్లు, గుట్టలకొద్దీ దగ్ధంచేసిన సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కాల్‌మనీ వ్యవహారంపై గట్టిచర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించడంతో వడ్డీ వ్యాపారులకు వెన్నులో వణుకు మొదలైంది. ఇటీవల రెండురోజుల క్రితం రేణిగుంట తహశీల్దార్ కార్యాలయంలో కాల్‌మనీ వ్యవహారంపై కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. రెండు రోజుల్లోనే మండలంలో అనేకమంది కాల్‌మనీ వ్యవహారంపై తహశీల్దార్‌కు ఫిర్యాదుచేశారు. ఓ పక్క తహశీల్దార్ దీనిపై విచారణ చేపడితే మరోపక్క మంగళవారం ఉదయం గుట్టలు గుట్టలుగా కల్వర్టు వద్ద ఖాళీ బాండు పేపర్లను, చెక్కులను దగ్ధం చేయడం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం రేణిగుంట తహశీల్దార్ మనోహర్‌కు తెలియడంతో ఆయన స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ దొరికిన ఖాళీ వందరూపాలయ స్టాంపు ప్రతాలను, రిజిస్టర్ డాక్యుమెంట్లు, అన్ రిజిస్టర్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై రేణిగుంట తహశీల్దార్ మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కాల్‌మనీ వ్యవహారంపై గట్టిచర్యలు చేపడుతున్నామన్నారు. వీటిలో 100 రూపాయల ఖాళీ స్టాంప్ ప్యాడ్‌లను రిజిస్టర్ డాక్యుమెంట్లు, అన్ రిజిస్టర్ డాక్యుమెంట్లు, తుడా అప్రూల్ లేఔట్ ఒరిజినల్ ప్లానింగ్ పత్రాలు లభ్యమైయ్యాయన్నారు. వీటిపై విచారణ చేపట్టేందుకు స్థానిక తిరుపతి అర్బన్, రూరల్ ఎమ్మార్వోలకు పంపిస్తామన్నారు. అక్కడ విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.