అంతర్జాతీయం

మోదీకన్నా నా కేబినెట్‌లోనే ఎక్కువ మంది సిక్కులున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెనడా ప్రధాని ట్రూడూ వ్యాఖ్య
వాషింగ్టన్, మార్చి 13: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలోకంటే తన మంత్రివర్గంలోనే ఎక్కువ మంది సిక్కులున్నారని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడూ అన్నారు. అమెరికాలో అధికారిక పర్యటన జరుపుతున్న ట్రూడూ వాషింగ్టన్‌లో అమెరికా యూనివర్శిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పది ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన సందర్భంగా ఈ విషయం చెప్పారు. శుక్రవారం యూనివర్శిటీలో దాదాపు అరగంట సేపు జరిగిన ఈ కార్యక్రమంలో పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన జహాన్ అనే విద్యార్థి మీ మంత్రివర్గంలో చాలా మంది సిక్కులుండడం గొప్ప విషయం అని ట్రూడూతో అన్నాడు. దీనిపై ట్రూడూ స్పందిస్తూ ‘నిజం చెప్పాలంటే మోదీ మంత్రివర్గంలోకంటే నా మంత్రివర్గంలోనే ఎక్కువ మంది సిక్కులున్నారు’ అని అన్నట్లు కెనడా దినపత్రిక ‘ది స్టార్’ పేర్కొంది.