క్రీడాభూమి

పాక్-బెంగాల్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 11: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొంటుందా? లేదా? అనే విషయంపై శుక్రవారం మధ్యాహ్నం వరకు స్పష్టత లేకపోవడంతో శనివారం ఆ జట్టుకు, బెంగాల్ రంజీ జట్టుకు మధ్య జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. ప్రపంచ కప్ టి-20 టోర్నీలో పాక్ ఈ నెల 16వ తేదీన గ్రూప్-ఎ క్వాలిఫయర్‌తో తలపడటానికి ముందు శనివారం బెంగాల్ జట్టుతోనూ, 14వ తేదీన డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకతోనూ రెండు సన్నాహక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే భారత్‌లో పాక్ జట్టు పర్యటనకు అనుమతి మంజూరు విషయంలో జాప్యం కొనసాగడంతో శనివారం బెంగాల్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. భారత్‌లో పాక్ జట్టు పర్యటన విషయమై ప్రస్తుతం ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోందని, పాక్ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఆ జట్టు దుబాయ్ మీదుగా శనివారం ఉదయం లేదా మధ్యాహ్నం భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని ఆ అధికారి వార్తా సంస్థకు తెలిపారు.
టి-20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఈ నెల 19వ తేదీన భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరగాల్సిన హై-ఓల్టేజ్ మ్యాచ్ వేదికను కోల్‌కతాకు మార్చిన విషయం తెలిసిందే. అయితే భారత్‌కు పాక్ జట్టు రాక ఆలస్యమవడంతో ఆ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల జారీ ప్రక్రియలో కూడా జాప్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానున్నాయి. ‘ఈ మ్యాచ్ టిక్కెట్లు మాకు ఇంకా చేరలేదు. వాటిపై స్టాంపులు వేయడంతో పాటు ఇతర లాంఛనాలు పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుంది. కనుక ఈ మ్యాచ్ టిక్కెట్ల జారీ ప్రక్రియను నెల 16వ తేదీ నుంచి ప్రారంభిస్తాం’ అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారి వివరించారు.
భారత్ చేరిన శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు
ఇదిలావుంటే, ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా జట్టు షెడ్యూలు ప్రకారమే భారత్‌కు చేరుకున్నాయి. దక్షిణాఫ్రికాలో టి-20 సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుని మంచి ఊపుమీదున్న ఆస్ట్రేలియా జట్టు దుబాయ్ మీదుగా భారత్‌కు చేరుకుంది. ప్రపంచ కప్ వనే్డ టోర్నీల్లో ఐదుసార్లు టైటిళ్లు సాధించి రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్ టి-20 టోర్నీలో మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ సాధించని విషయం తెలిసిందే. ప్రస్తుత టి-20 ప్రపంచ కప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా జట్టు ఈ నెల 13వ తేదీన వెస్టిండీస్‌తో సన్నాహక మ్యాచ్ ఆడనుంది.