అంతర్జాతీయం

మైన్మార్ అధ్యక్ష పదవికి సూకీ డ్రైవర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అభ్యర్థిని ప్రకటించిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ
అనుకున్నట్టే జరిగింది. మైన్మార్ ప్రజాస్వామ్య ప్రదాత సూకీకి దేశాధ్యక్ష పదవి దక్కలేదు. సైనిక రాజ్యాంగం పుణ్యమా అని అధ్యక్ష పదవికి అధికార ఎన్‌ఎల్‌డి అభ్యర్థిగా సూకీ మాజీ డ్రైవర్, అపర విధేయుడు హిన్ క్వా నామినేట్ అయ్యారు. ఎవరు అధ్యక్ష పదవిలో ఉన్నా..పరోక్ష పవర్ తనదేనంటూ సూకీ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే..
-----------------------
నేపీడా, మార్చి 10: మయన్మార్ కొత్త అధ్యక్ష పదవికి ఆంగ్ సాన్ సూకీ మాజీ డ్రైవర్, ఆమె సన్నిహిత అనుచరుడిని అభ్యర్థిగా ఆమె పార్టీ గురువారం నామినేట్ చేసింది. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో లక్షలాది ఓటర్లు తన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీకి తిరుగులేని మెజారిటీని కట్టబెట్టినందున వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడానికి తాను అధ్యక్ష పదవిని చేపట్టలేక పోయినప్పటికీ తన నమ్మిన బంటుద్వారా దేశాన్ని పాలించడానికి సూకీ నిర్ణయించుకున్న నేపథ్యంలో పార్టీ ఆమె నమ్మిన బంటును అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. అధ్యక్ష పదవికి సూకీ ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై అనేక నెలలుగా రకరకాల ఊహాగానాలు కొనసాగిన తర్వాత సూకీతో కలిసి స్కూల్‌కు వెళ్లిన, ప్రస్తుతం ఆమె చారిటబుల్ ట్రస్టును నడుపుతున్న 69 ఏళ్ల తిన్ క్యాను ఈ పదవికి ఎంపిక చేయడం గమనార్హం. ఇప్పటికీ ప్రభుత్వంపై సైన్యం ప్రభావం పెద్దగానే ఉన్న కారణంగా అత్యంత సున్నితమైన అధికార మార్పిడి ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతో తిన్ క్యాను ఎంపిక చేసే విషయం చివరికి ఆమె పార్టీ ఎంపీలకు సైతం తెలికుండా జాగ్రత్త పడ్డారు.4
ఎన్‌ఎల్‌డికి తిరుగులేని మెజారిటీని కట్టబెట్టిన లక్షలాది మంది ఓటర్ల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో ఇది చాలా ముఖ్యమైన చర్య2 అని సూకీ గురువారం ఱదయం ఆమె పార్టీ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ పార్టీ లక్ష్యాన్ని శాంతియుతంగా సమర్థించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం శతాబ్దాల పాటు అలుపెరుగని పోరాటం చేసిన 70 ఏళ్ల సూకీయే దేశానికి అధ్యక్షురాలవుతారని దేశంలో చాలా మంది చివరిదాకా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె అధ్యక్షురాలు కావడానికి న్యాయపరమైన అడ్డంకులను తొలగించడం కోసం సైన్యంతో నెలల తరబడి జరిపిన చర్చలు విఫలమైనాయి. సన్నిహిత విదేశీ బంధువులుండే ఎవరు కూడా అధ్యక్ష పదవిని చేపట్టకూడదన్న క్లాజు కారణంగా ఆమె అధ్యక్ష పదవిని చేపట్టలేక పోయారు. సూకీ దివంగత భర్త, ఆమె ఇద్దరు కుమారులు కూడా బ్రిటీష్ పౌరులే. అధ్యక్ష పదవికి ఎన్‌ఎల్‌డి తరఫున యు తిన్ క్యా పేరును ప్రతిపాదిస్తున్నట్లు పార్లమెంటు దిగువ సభలో ఆ పార్టీ ఎంపీ ఖిన్ శాన్ లాయింగ్ ప్రకటించారు. ఎన్‌ఎల్‌డి ఎగువ సభనుంచి మరో అభ్యర్థిని కూడా నామినేట్ చేస్తుంది. అలాగే పార్లమెంటులో 25 శాతం స్థానాలు కలిగి ఉండే సైన్యం కూడా మరో అభ్యర్థిని ప్రకటిస్తుంది. పార్లమెంటు ఉభయ సభలకు చెందిన సభ్యులు కలిసి ఈ ముగ్గురిలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. మిగిలిన ఇద్దరూ ఉపాధ్యక్షులుగా ఉంటారు.