రాష్ట్రీయం

జనవరి 10న అమరావతి మారథాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నగరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావటంతో పాటు ప్రజలంతా శారీరక వ్యాయామంతో ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో తాజాగా ఏర్పాటైన డీసెస్ ఎరాడికేషన్ త్రో ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ (డ్రీప్) స్వచ్ఛంద సంస్థ జనవరి 10న అమరావతి మారథాన్ (మహాపాదయాత్ర)కు సన్నాహాలు చేపట్టింది. సాధారణంగా దేశ, విదేశాల్లో కనీసం 40 కి.మీ. మేర మారథాన్ జరుగుతుండటంతో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన 21.5 కి.మీ. దూరంలో ఉద్దండరాయునిపాలెంలోని శిలాఫలకం వరకు వెళ్లి తిరిగి తొలుత ప్రారంభమైన నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ఈ మహాపాదయాత్ర జరిగేలా రూపకల్పన చేశారు. అయితే రాష్ట్రంలోనే ఇలాంటి మారథాన్ తొలిసారి కావటంతో మూడు కేటగిరీల్లో నిర్వహించదలిచారు. 42 కి.మీ.లు నడిచేవారిని ఒక కేటగిరిలో, 10 కి.మీ.లు నడిచేవారిని రెండో కేటగిరి, 5 కి.మీ.లు నడిచేవారిని మూడో కేటగిరీలో చేరుస్తారు. అయితే దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్ ఖరారు కావాల్సి వుంది.
ఈ మహాపాదయాత్రలో పాల్గొన దలచినవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వుంటుందని నిర్వాహకులు కె పట్ట్భారామ్, డాక్టర్ రాకేష్, డాక్టర్ వి మధు తెలిపారు. సోమవారం నాడిక్కడ ఏర్పాటైన ఓ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, అంతర్జాతీయ చెస్‌మాస్టర్ కోనేరు హంపి, సినీహీరో పోతినేని రామ్ సమక్షంలో వారు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రకటించారు. ఈ మహాపాదయాత్రలో కనీసం 15వేల మంది పాల్గొంటారని భావిస్తున్నారు. వీరందరికీ టైమర్లు అమర్చి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. మారథాన్‌లో దేశ, విదేశీ ప్రసిద్ధ క్రీడాకారులు, సినీ తారలు, ప్రముఖులు పాల్గొంటారని నిర్వాహకులు వివరించారు.